బెట్టింగ్‌ బలి!

ABN , First Publish Date - 2020-10-22T06:44:13+05:30 IST

యువతకు ఆహ్లాదం, ఆ నందం అందించాల్సిన ఆటలు ప్రాణాలు తీస్తున్నాయి. కేవలం శారీర దారుఢ్యంకోసం, గేమ్‌ స్పిరిట్‌ కోసం ఆడా ల్సిన ఆటలు యువత పెడదారిన పడేందుకు దోహదం చే స్తున్నాయి

బెట్టింగ్‌ బలి!

నగరాల నుంచి గ్రామాలకు స్తరించిన వైనం 

టాస్‌ నుంచి చివరి బంతి వరకు పందాలు  

తెలియకుండానే బెట్టింగ్‌ ఊబిలో  పడుతున్న జిల్లా యువత 

అప్పుల పాలై పరువు భయంతో  ఆత్మహత్యలు 


సుభాష్‌నగర్‌, అక్టోబరు 21: యువతకు ఆహ్లాదం, ఆ నందం అందించాల్సిన ఆటలు ప్రాణాలు తీస్తున్నాయి. కేవలం శారీర దారుఢ్యంకోసం, గేమ్‌ స్పిరిట్‌ కోసం ఆడా ల్సిన ఆటలు యువత పెడదారిన పడేందుకు దోహదం చేస్తున్నాయి. ఇతర ఆటల మాట ఎలా ఉన్నా క్రికెట్‌కు ఉ న్న క్రేజ్‌ ఆంతా ఇంతా కాదు.. టీమ్‌తో కలిసి ఆడాల్సిన ఆ టలు కాస్తా ప్రస్తుతం టీమ్‌గా ఆటగాళ్ల పనితీరుపై, ఆట గెలుపోటములపై అంచనాలు వేయాల్సింది పోయి షరతు లు పెట్టే పరిస్థితికి వచ్చింది. అందుకు ఐపీఎల్‌ బాగా స హకరిస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌ వచ్చిందంటే కొందరి పం డుగగా మారింది. కొందరైతే దీనిమీదనే ఆదారపడి రూ. లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. సంపాదించేవారు నూ టిలో ఒక్కరైతే నష్టపోయేవారు కోకొల్లలు. డబ్బులు సంపాదించాలనే ఆశ రోజు రోజుకు పెరుగుతోంది.


ఈ బెట్టింగ్‌ల్లో ఒకరోఇద్దరో కోటీశ్వరులవుతున్నా మరికొందరు మా త్రం సర్వం కోల్పోయి కుటుంబాలను బజారుకీడుస్తున్నారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ బెట్టి సంస్కృతి నేడు పల్లెలకూ పాకింది. దీంతో అప్పుల పాలైన పలువురు యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వంద రూపాయల నుంచి లక్షల్లో సైతం బెట్టింగ్‌ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇందులో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఎక్కువ కావడంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ముఖ్యమైన స్థావరాల్లో మాత్రమే పోలీసుల నిఘా ఉంటుంది. గల్లీల్లో, చాయ్‌ హోటళ్లు, మూసివుంచిన పాఠశాలలు, గ్రామ శివార్లను స్థావరాలుగా ఏర్పాటుచేసుకున్నారు. పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడితే తప్ప బెట్టింగ్‌ జరుగుతుందని తెలియడం లేదు. అప్పుడప్పుడు పోలీసులు కొందరిని అరెస్ట్‌ చేసినా నామమాత్రమే. పూర్తిగా నివారించలేకపోతున్నారు.


ఆన్‌లైన్‌ బెట్టింగ్‌....

గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌లను కొందరు మాత్రమే నిర్వహించేవారు. రెండేళ్ల క్రితం అటువంటి వారు పోలీసుల నిఘాలో ఉండడంతో వారు ప్రస్తుతం దూరంగా ఉంటు న్నారు. ప్రస్తుతం మొత్తం ఆన్‌లైన్‌లోనే  బెట్టింగ్‌ సాగుతుంది. గూగుల్‌ సెర్చ్‌లో బెట్టింగ్‌ బుకీల నెంబర్‌లు తీసు కొని వాటి ఆధారంగా వాట్సాప్‌లో ఛాటిం గ్‌ చేస్తూ ఆన్‌లైన్‌ పేమెంట్‌లు కొనసాగిస్తున్నారు. బెట్టింగ్‌ బుకీల కు బీహార్‌, రాజస్థాన్‌, రాజ్‌కోట్‌, నాగాపూర్‌ రాష్ట్రాలు బెట్టింగ్‌ కేంద్రాలుగా ఉన్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ద్వారా బె ట్టింగ్‌లను కొనసాగిస్తున్నారు. 


ముందే డిపాజిట్‌..

బెట్టింగ్‌కు పాల్పడే బూకీలకు ముందుగానే డబ్బులు చెల్లించాలి. కొన్ని ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా డబ్బులు చెల్లించిన తర్వాత బెట్టింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. కొన్ని యా ప్‌లు ముందుగానే ఊహించి రేటింగ్‌లు ఇచ్చి బెట్టింగ్‌ ప్రియులకు ఊతమిస్తున్నాయి.  బె ట్టింగ్‌కు పాల్పడేవారికి సహకరిస్తున్నాయి. డిపాజిట్‌ చే యకపోతే మాత్రం బెట్టింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉండవు. దీంతో వారు డబ్బుల కోసం అప్పు లు చేసి బెట్టింగ్‌ల కు పాల్పడుతున్నారు. 


గ్రామాలకూ ఐపీఎల్‌ బెట్టింగ్‌..

మెట్రోపాలిటన్‌ పట్టణాలుకే పరిమితమైన క్రికెట్‌ బెట్టింగ్‌లు ప్రస్తు తం గల్లీగల్లీకి వ్యాపించింది. పల్లెలకు పాకింది. గ్రామాల్లో సైతం క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. గతంలో ఇందల్వాయి మండలంలో యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు జరిగాయి. ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు జులాయిలు బెట్టింగ్‌ను ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుంటున్నారు. టాస్‌ వేసిన నుంచి బెట్టింగ్‌ మొదలవుతుంది. ఓవర్‌ ఒవర్‌కు, అంతేందుకు ప్రతీ బాల్‌కు కూడా బెట్టింగ్‌ ఉంటుంది. మ్యాచ్‌ మొదలైందంటే చాలు అందరూ ఒకచోట గుమిగూడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నరు. డబ్బులు చెల్లించే విషయంలో ఘర్షణలు జరుగుతున్నాయి. అప్పటివరకు గుట్టుగా సాగే ఈ వ్యవహారం కాస్తా రట్టవుతోంది.  


అప్పుల పాలై ప్రాణాల మీదకు..

తేలిక మనీ కోసం అలవాటు పడ్డ యువకులు బెట్టింగ్‌లకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అభం శుభం తెలియని యువకులు ఈ విషవలయంలో చిక్కుకుని తమ విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగిలిస్తున్నారు. ఇంట్లో బుద్దిమంతులుగా ఉంటున్న వీరు బయటకు వెళ్లి ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. తమ కొడుకు బయట కూడా బుద్దిగానే ఉం టున్నాడనుకుంటున్నారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ వారికి తలవంపులు తెస్తున్నారు. బెట్టింగ్‌కు డబ్బు లు లేక కొందరు సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తున్నారు. మరికొందరు గుట్టుగా బయట అప్పులు తెస్తున్నారు. అప్పుల భారం పెరిగి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, బెట్టింగ్‌ మాఫియాకు భయపడి చివరికి తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు.


ఇటీవల తాజాగా నిజామాబాద్‌ రూరల్‌ మండలంలో బీటెక్‌ పూర్తిచేసిన 24 ఏళ్ల యువకుడు బెట్టింగ్‌కు బలయ్యాడు. బెట్టింగ్‌ కోసం రూ.లక్షల్లో అప్పులు చేసి చివరికీ తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ముఖం చూపించలేక ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణాకి పాల్పడ్డాడు. ఉన్న త చదువు చదివి చేతికందివస్తాడనుకున్న కొడుకు విగత జీవిగా చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇలాంటి యువకులెందరో బెట్టింగ్‌లతో ప్రతీరోజు ఎక్కడో అక్కడ బలవుతూనే ఉన్నారు. కొందరు డబ్బులున్న యువకులు బెట్టింగ్‌లను స్టేటస్‌ సింబల్‌ అనుకొని బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు లేని యువకులను బెట్టింగ్‌లకు పాల్పడేటట్లు ఉసిగొలుపుతున్నారు. డబ్బులు కో ల్పోయిన యువకుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అప్పులు తీర్చలేక కన్నవారిని ఏమి అనలేక ఇబ్బందులు పడుతున్నారు. 


బెట్టింగ్‌ నిర్వహిస్తే జైలుకే..ఉషా విశ్వనాథ్‌, అదనపు డీసీపీ 

 బెట్టింగ్‌ ఏ రూపంలో నిర్వహించినా నేరమే. అటువంటి చర్యలకు పాల్పడినవా రు కటకటాలు లెక్కించాల్సి వస్తుంది. బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. బెట్టింగ్‌ నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 

Updated Date - 2020-10-22T06:44:13+05:30 IST