Advertisement

బిగ్‌బాస్‌ 4కి ఐపీఎల్‌ దెబ్బ

Sep 25 2020 @ 10:44AM

కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న సమయంలో ప్రేక్షకులు ఎక్కువగా టీవీలు, ఓటీటీ మాధ్యమాలకు పరిమితమయ్యారు. ఈ తరుణంలో తెలుగు బిగ్‌బాస్‌ 4 ప్రారంభం కావడమే కాదు..మూడో వారం ముగింపుకు చేరుకోనుంది. మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. బిగ్‌బాస్‌ తొలి మూడు సీజన్స్‌పై ఉన్న అంచనాలతో నాలుగో సీజన్‌పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ క్రేజ్‌ లేని కంటెస్టెంట్స్, ఆకట్టుకోలేని గేమ్‌ ప్లానింగ్స్‌తో బిగ్‌బాస్‌ 4 రేటింగ్‌ క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ రూపంలో బిగ్‌బాస్‌పై అనుకోని పిడుగుపడింది. తొలి వారంలో హయ్యస్ట్‌ రేటింగ్‌ను సాధించిన బిగ్‌బాస్4‌.. మూడో వారం చేరేసరికి సీరియల్స్‌ కంటే వెనకపడింది. ఈ కమ్రంలో రీసెంట్‌గా స్టార్ట్‌ అయిన ఐపీఎల్‌ వైపు ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్‌ ప్రారంభంలోనే బిగ్‌బాస్‌ 4కు ఇలాంటి షాక్‌ తగిలితే.. పొట్టి క్రికెట్‌ మరింత రసవత్తరంగా మారితే బిగ్‌బాస్‌ రేటింగ్‌ మరింత దిగజారే ప్రమాదం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారట. మరో వైపు తమిళ, హిందీ బిగ్‌బాస్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వాహకులు కూడా అనుకోని రూపంలో వచ్చిన ఐపీఎల్‌ దెబ్బ నుండి ఎలా తప్పించుకోవాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారట. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.