IPL 2022: GT vs SRH మ్యాచ్‌లో ఎవరికి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందంటే..

ABN , First Publish Date - 2022-04-28T00:25:38+05:30 IST

ఈ మ్యాచ్‌కు వేదిక కానున్న వాంఖడే స్టేడియంలో ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం ఏడు మ్యాచులు జరిగాయి. తొలుత బ్యాటింగ్ ఆడిన జట్లు 2 మ్యాచుల్లో విన్ అవ్వగా, తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీంలు..

IPL 2022: GT vs SRH మ్యాచ్‌లో ఎవరికి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందంటే..

IPL 2022 సీజన్‌లో భాగంగా మరో ఉత్కంఠ పోరుకు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ సీజన్ 40వ ఐపీఎల్ మ్యాచ్ Gujarat Titans, Sunrisers Hyderabad జట్ల మధ్య బుధవారం రాత్రి 7.30 గంటలకు మొదలవబోతోంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ కావడంతో ఇరు జట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకూ మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్‌ల్లో విజయబావుటా ఎగరవేయగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడి 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య పోరు కావడంతో ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇదో గుర్తుండిపోయే మ్యాచ్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికి ఒక మ్యాచ్ జరగ్గా ఆ మ్యాచ్‌లో SRH గెలిచింది. GT ఓటమిపాలైంది.



ఈ రెండు టీమ్స్ ఆడిన ‌గత మ్యాచ్‌లను పరిశీలిస్తే.. SRH టీం ఏప్రిల్ 23న RCBతో మ్యాచ్ ఆడి ఆ టీంను ఘోరంగా ఓడించింది. అదే రోజు KKRతో మ్యాచ్ ఆడిన Gujarat Titans నైట్‌రైడర్స్ టీంను ఓడించి సత్తా చాటింది. ఇలా.. ఈ రెండు టీమ్స్ కూడా గత మ్యాచుల్లో గెలిచిన జోష్‌ల్లో ఉన్నాయి. అలాంటి రెండు టీంలు ఇవాళ తలపడనున్నాయి. ఇక.. ఈ మ్యాచ్‌కు వేదిక కానున్న వాంఖడే స్టేడియంలో ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం ఏడు మ్యాచులు జరిగాయి. తొలుత బ్యాటింగ్ ఆడిన జట్లు 2 మ్యాచుల్లో విన్ అవ్వగా, తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీంలు 5 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 194 కాగా, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 182గా ఉంది. ఇక.. ఇప్పటి SRH vs GT మ్యాచ్ టాస్ విషయానికొస్తే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముంబైలోని స్టేడియమ్స్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు దాదాపుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశమే ఉంది.



Gujarat Titans ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడాల్సి వస్తే స్కోర్ 180 నుంచి 200 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ ఆడాల్సి వస్తే 160 నుంచి 180 వరకూ స్కోర్ చేయొచ్చు. ఇక.. Sunrisers Hyderabad ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడితే స్కోర్ 170 నుంచి 190 వరకూ వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ ఆడితే స్కోర్ 160 నుంచి 180 వరకూ ఉండొచ్చు. ఇక.. Players Form విషయానికొస్తే.. Gujarat Titans టీంలో హార్థిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ Form పరంగా పర్వాలేదనిపిస్తున్నారు. అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, మ్యాథ్యూ వేడ్ బ్యాటింగ్ మెరుగుపడితే Gujarat Titans జట్టు బ్యాటింగ్‌‌‌‌పరంగా బలపడినట్టే. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, ఫెర్గ్యూసన్, రషీద్ ఖాన్ Formలో ఉన్నారు.



SRH బ్యాటింగ్ విషయానికొస్తే.. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మర్క్రమ్ బాగానే ఆటతీరు కనబరుస్తున్నారు. విలియమ్‌సన్, పూరన్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ మెరుగుపడితే బ్యాటింగ్‌పరంగా SRHకు కష్టాలు తప్పినట్టే. SRH బౌలింగ్‌లో నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, జాన్‌సేన్ ఉత్తమ ఆటతీరును కనబరుస్తుండగా.. సుచిత్, వాషింగ్టన్ సుందర్ పర్వాలేదనిపిస్తున్నారు. ఇదీ.. SRH vs GT మ్యాచ్ ప్రివ్యూ. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీంకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఒక అంచనా. మరి.. ఈ అంచనానే నిజమవుతుందో లేక ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడిన టీమ్ గెలుపు గుర్రం ఎక్కుతుందో తెలియాలంటే మ్యాచ్ మొదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-04-28T00:25:38+05:30 IST