కార్తీక్‌.. నీ ఆట భళా!

ABN , First Publish Date - 2022-04-18T09:10:14+05:30 IST

ఐపీఎల్‌లో అదరగొడుతున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌పై ఆ జట్టు సహచరుడు కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.

కార్తీక్‌.. నీ ఆట భళా!

ముంబై: ఐపీఎల్‌లో అదరగొడుతున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌పై ఆ జట్టు సహచరుడు కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తన ఆటద్వారా.. టీమిండియాలో పునరాగమనానికి తలుపులు తెరవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాడన్నాడు. లీగ్‌లో బెంగళూరు తరఫున ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో కార్తీక్‌ 209.57 స్ట్రయిక్‌ రేట్‌తో 197 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఒక్కసారి మాత్రమే అవుటయ్యాడు. ఆదివారం ఢిల్లీతో మ్యాచ్‌లో కార్తీక్‌ (34 బంతుల్లో 66 నాటౌట్‌) ధనాధన్‌ అర్ధశతకంతో బెంగళూరు 16 పరుగులతో నెగ్గింది. ఫినిషర్‌గా కార్తీక్‌ నిర్వర్తిస్తున్న పాత్రను చూసి మాజీ సహచరుడు డివిల్లీర్స్‌ ఎంతో సంతోషిస్తుంటాడని చెప్పాడు. 36 ఏళ్ల కార్తీక్‌.. 2019లో భారత్‌ తరఫున వన్డే వరల్డ్‌క్‌పలో చివరి మ్యాచ్‌ ఆడాడు.

Updated Date - 2022-04-18T09:10:14+05:30 IST