10న ఐపీఎల్‌ ఫైనల్‌

ABN , First Publish Date - 2020-10-27T09:14:19+05:30 IST

ఐపీఎల్‌-13వ సీజన్‌ ప్లేఆఫ్స్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. వచ్చే నెల 10న జరిగే ఐపీఎల్‌ మెగా ఫైనల్‌కు దుబాయ్‌ ఆతిథ్యం

10న ఐపీఎల్‌ ఫైనల్‌

వచ్చే నెల 5,6,8 తేదీల్లో ఫ్లేఆఫ్స్‌ 

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌ ప్లేఆఫ్స్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. వచ్చే నెల 10న జరిగే ఐపీఎల్‌ మెగా ఫైనల్‌కు దుబాయ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫైనల్‌తో పాటు తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ (నవంబరు 5) కూడా దుబాయ్‌లోనే జరగనుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ (నవంబరు 6), రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ (నవంబరు 8)కు వేదికగా అబుదాబి ఖరారైంది. మహిళల ఐపీఎల్‌ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది. వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్నీ మ్యాచ్‌లు షార్జాలోనే నిర్వహించనున్నారు. ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. 9న ఫైనల్‌ జరగనుంది. 

Updated Date - 2020-10-27T09:14:19+05:30 IST