ఐపీఎం మెడల్‌కు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఎంపిక

ABN , First Publish Date - 2022-01-26T07:14:48+05:30 IST

కాకినాడ క్రైం, జనవరి 25: జాతీయ పోలీస్‌ విశిష్ఠ సేవా పతకం (ఇండియన్‌ పోలీస్‌ మెరిటోరియస్‌)కి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబు ఎంపికయ్యారు. 73వ భారత గణతం త్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి అందజేసే ఈ పురస్కారానికి ఏపీ నుంచి ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు ఎంపికవ్వ

ఐపీఎం మెడల్‌కు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఎంపిక

కాకినాడ క్రైం, జనవరి 25: జాతీయ పోలీస్‌ విశిష్ఠ సేవా పతకం (ఇండియన్‌ పోలీస్‌ మెరిటోరియస్‌)కి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాఽథ్‌బాబు ఎంపికయ్యారు. 73వ భారత గణతం త్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి అందజేసే ఈ పురస్కారానికి ఏపీ నుంచి ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు ఎంపికవ్వడం విశేషం. వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ముత్తకూరి రవీంద్రనాథ్‌బాబు 2001లో గ్రూప్‌-1 అధికారిగా ఎంపికై పోలీసు శాఖలో గుంటూరు జిల్లా గురజాల సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారిగా ప్రారంభించి వరంగల్‌ రూరల్‌, గుంటూరు టౌన్‌ పనిచేశారు. అనంతరం అడిషనల్‌ ఏఎస్పీ ఆపరేషన్స్‌గా విజయనగరం, హైద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా తదుపరి విజయవాడ శాంతిభద్రతల డీసీపీగా, గేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం విజయవాడ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారిగా అనంతరం విశాఖలో లాఅండ్‌ఆర్డర్‌ డీసీపీగా పనిచేస్తూ ఎస్పీగా పదోన్నతి పొంది కృష్ణా జిల్లా ఎస్పీగా 2019లో బాధ్యతలు చేపట్టారు. 12 జూలై 2021లో  మన జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి గంజాయిసాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. గంజాయిని సమూలంగా నాశనం చేసే క్రమంలో  పటిష్ట నివారణ చర్యలు చేపట్టారు.  పోలీసు, ఎస్‌ఈబీ అధికారుల సమన్వయం చేసి సుమారు రూ. 30 కోట్ల విలువచేసే 60 వేల కిలోల గంజాయిని ఽధ్వంసం చేశారు. స్మగ్లర్లు, కూలీలను అరెస్టు చేశారు. పరివర్తన కార్యక్రమంలో పెద్దఎత్తున గిరిజన యువతీ, యువకులకు పలు కంపెనీల్లో జాబ్‌మేళా నిర్వహించి ఉద్యోగ అవ కాశాలు కల్పించారు. ఈయన అందించిన సేవలకు 2007లో కఠిన సేవా పతకం, 2009లో పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, 2017లో ఉత్తమ సేవా పతకాలు సొంతం చేసుకున్నారు. 2022 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతకానికి ఎంపికవ్వడం విశేషంగా చెప్పొచ్చు.

Updated Date - 2022-01-26T07:14:48+05:30 IST