ఐపీఓలు సిద్ధం...

Jun 15 2021 @ 20:17PM

హైదరాబాద్ : మార్కెట్ల్‌లోకి  మరో రౌండ్ ఐపీఓలు రానున్నాయి. కిమ్స్, దొడ్ల డైరీ, శ్యామ్ మెటాలిక్స్, సోనా కామ్‌స్టార్ కంపెనీలు ఈ వారంలోనే ఐపీఓలతో ఇన్వెస్టర్లను పలకరించబోతున్నాయి. కాగా వీటికి ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోంది. ప్రైమరీ మార్కెట్‌లో ప్రవేశించే సంస్థలకు ఎంతటి క్రేజ్ ఉందో ఈ క్రమంలో అర్ధమవుతోందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. కాగా... ఇప్పుడు బుల్ ర్యాలీ కూడా ఇన్వెస్టర్లలో కొత్త తరం రాకని ఉత్సాహపరుస్తోంది. 


 సోనా కామ్‌స్టార్,శ్యామ్ మెటాలిక్స్, దొడ్లడైరీ, కిమ్స్, ఐపిఓలకు గ్రే మార్కెట్‌లో నడుస్తోన్న ప్రీమియం... ఈ ఐపీఓల పట్ల ఆసక్తి ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవడానికి  మరో సంకేతంగా మారింది. కాగా... ఈ నాలుగు ఇష్యూల్లో  రెండు ఇష్యూలకు స్పందన భారీగా కనబడుతోంది. మిగిలిన రెండింటికీ అంతంత స్పందనే ఉన్నా, దానికి కారణం అగ్రెసివ్‌గా ధరను హై లెవెల్ లో నిర్ణయించడమేనని వినవస్తోంది. ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్టస్‌లో చూసినప్పుడు ఈ కంపెనీలు ఫిక్స్ చేసిన ప్రైస్ బ్యాండ్ మరీ ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.