సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2022-06-29T03:31:46+05:30 IST

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది.

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు

Amaravathi: సీనియర్  ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ తొలగించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా వైసీపీ ప్రభుత్వం ఆయనను నియమించింది.  అయితే ఇప్పుడు సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఏబీ వెంకటేశ్వరరావు క్రమశిక్షణారహిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ప్రభుత్వ సీఎస్ సమీర్ శర్మ మరోసారి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.  


 ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో సర్వీస్ నిబంధలను ఉల్లంఘించారనే అభియోగాలతో వైసీపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఆయన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వగా.. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టు తీర్పు విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ కేసు విషయంలో హైకోర్టు ఉత్తర్వులే అమలవుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2022-06-29T03:31:46+05:30 IST