విజయదశమికి ‘ఐక్యూ’

Published: Thu, 18 Aug 2022 07:10:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విజయదశమికి ఐక్యూ

సీనియర్‌ నటుడు సుమన్‌ ప్రత్యేక పాత్ర పోషించిన చిత్రం ‘ఐక్యూ’. సాయిచరణ్‌, పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్‌ జి.ఎల్‌. బి. దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి సుమన్‌ మాట్లాడుతూ ‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నేను పోలీస్‌ కమిషనర్‌ పాత్ర పోషించాను. అనంతపురంలో షూటింగ్‌ జరిగింది’ అని తెలిపారు. ‘మా అన్న కొడుకు సాయిచరణ్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. సత్యప్రకాశ్‌ పై చిత్రీకరించే ఐటెమ్‌ సాంగ్‌తో చిత్రనిర్మాణం పూర్తవుతుంది. విజయదశమి రోజున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని నిర్మాత లక్ష్మీపతి చెప్పారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International