‘ఐక్యూ నియో 5’ నుంచి వచ్చేసిన టీజర్... వచ్చేనెల 16న లాంచింగ్

ABN , First Publish Date - 2021-02-28T23:42:29+05:30 IST

వివో సబ్ బ్రాండ్ ఐక్యూ మరో నయా స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి వచ్చేస్తోంది. వచ్చే నెల 16న లాంచ్ చేయనున్న

‘ఐక్యూ నియో 5’ నుంచి వచ్చేసిన టీజర్... వచ్చేనెల 16న లాంచింగ్

న్యూఢిల్లీ: వివో సబ్ బ్రాండ్ ఐక్యూ మరో నయా స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి వచ్చేస్తోంది. వచ్చే నెల 16న లాంచ్ చేయనున్న ‘ఐక్యూ నియో 5’ టీజర్‌ను తాజాగా పోస్టు చేసింది. గతేడాది ఏప్రిల్‌లో చైనాలో విడుదలైన ‘ఐక్యూ నియో 3 5జీ’కి ఇది సక్సెసర్. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ఎస్ఓసీని ఇందులో ఉపయోగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత నెలలోనే దీనిని ప్రవేశపెట్టగా, ఇటీవల విడుదలైన షావోమీకి చెందిన రెడ్‌మి కె40లో దీనిని ఉపయోగించారు. ఐక్యూ నియో5లో శాంసంగ్ సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే, బహుళ కెమెరా సెటప్ ఉపయోగించినట్టు తెలుస్తోంది.  అలాగే, హోల్‌పంచ్ డిస్‌ప్లే డిజైన్‌ ఉన్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. 


ఐక్యూ నియో 5 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర భారత్ రూ. 34 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 37,500, 12జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 38,600, టాప్ ఎండ్ అయిన 12 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 46 వేల వరకు ఉండొచ్చని సమాచారం.


ఐక్యూ నియో 5 స్పెసిఫికేషన్లు (అంచనా): శాంసంగ్ తయారీ 120Hz సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ముందువైపు 16 ఎంపీ కెమెరా, వెనకవైపు 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో మూడు కెమెరాలు, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ఎస్ఓసీ, 12జీబీ ర్యామ్, 256 ఆన్‌బోర్డ్ స్టోరేజీ, 4,400 ఎంఏమెచ్ బ్యాటరీ, 88W ఫాస్ట్ చార్జింగ్, అలాగే, 66W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు.

Updated Date - 2021-02-28T23:42:29+05:30 IST