బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. కొన్ని రోజుల క్రితం తన మానసిక సమస్య గురించి ఐరా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే 14 ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించి సంచలనం రేకెత్తించింది.
తాజాగా ఈమె ప్రేమ వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. జిమ్ ట్రైనర్ నుపూర్ శిఖారెతో ఐరా ప్రేమలో పడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమిర్ జిమ్ ట్రైనర్ అయిన నుపూర్ లాక్డౌన్ సమయంలో ఐరా చేత కూడా వర్కవుట్లు చేయించాడట. ఆ సమయంలోనే వీరి ప్రేమ చిగురించినట్టు సమాచారం. వీరి ప్రేమను ఐరా తల్లి రీనా దత్తా ఆమోదించిందట. దీంతో మహాబలేశ్వర్‌లోని ఆమీర్ ఫామ్‌హౌస్‌లో ఈ జంట స్నేహితులతో కలిసి పార్టీ కూడా చేసుకున్నట్టు సమాచారం.