Iran దేశంలో మూడు నెలల్లో 100 మందికి ఉరి శిక్ష

ABN , First Publish Date - 2022-06-22T18:12:14+05:30 IST

ఇరాన్ దేశంలో ఈ ఏడాది కేవలం మూడు నెలల్లో 100మందికి పైగా వ్యక్తులను ఉరి తీశారు....

Iran దేశంలో మూడు నెలల్లో 100 మందికి ఉరి శిక్ష

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సంచలన నివేదిక

జెనీవా: ఇరాన్ దేశంలో ఈ ఏడాది కేవలం మూడు నెలల్లో 100మందికి పైగా వ్యక్తులను ఉరి తీశారు. ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి మార్చి 20వతేదీల మధ్య మూడు నెలల్లో 105మందికి మరణ శిక్షలు అమలు చేశారని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తన తాజా నివేదికలో వెల్లడించింది. ఉరితీతకు గురైన వారిలో ఇరాన్ దేశంలో మైనారిటీ వర్గాలకు చెందిన వారున్నారు. జెనీవాలోని యూఎన్ మానవ హక్కుల మండలిలో మానవ హక్కుల డిప్యూటీ చీఫ్ నాడా అల్-నషిఫ్ ఇరాన్‌పై తాజా నివేదికను విడుదల చేశారు. 2020వ సంవత్సరంలో 260 మంది వ్యక్తులకు మరణశిక్ష విధించగా, 2021లో కనీసం 14 మంది మహిళలతో సహా 310 మంది వ్యక్తులను ఉరితీశారని అని నాడా అల్-నషిఫ్ చెప్పారు. ఈ సంవత్సరం కూడా అదే ట్రెండ్ కొనసాగింది.జనవరి 1, మార్చి 20 తేదీల మధ్య 105 మందికి మరణశిక్ష విధించారు. 


మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలతో సహా తక్కువ నేరాలకు ఉరిశిక్షలు పెరగడంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలపై 52 మందిని ఉరిశిక్ష కోసం షిరాజ్ జైలుకు తరలించినట్లు నషిఫ్ చెప్పారు.అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ బాల నేరస్తులకు మరణశిక్షను కొనసాగించడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు.ఈ ఏడాది మైనర్‌ నేరాల కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు మరణశిక్ష విధించారు. 85 కంటే ఎక్కువ బాల నేరస్థులు మరణశిక్షకు గురయ్యారని ఆమె చెప్పారు.


Updated Date - 2022-06-22T18:12:14+05:30 IST