Viral News: లైంగిక సంతృప్తి కోసం వింత నిర్వాకం.. అదే అతడి కొంపముంచింది.. భర్తను ఆ భార్య ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పింది విని..

Published: Thu, 18 Aug 2022 11:25:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral News: లైంగిక సంతృప్తి కోసం వింత నిర్వాకం.. అదే అతడి కొంపముంచింది.. భర్తను ఆ భార్య ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పింది విని..

ఇంటర్నెట్ డెస్క్: అతడి వయస్సు 50ఏళ్లు. కొద్ది రోజులుగా అన్నం తినడం లేదు. మలబద్దకంతోపాటు డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు అతడి భార్య గమనించింది. ఏమైందంటూ విషయం తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే అతడు నోరు మెదపలేదు. దీంతో చేసేదేమీ లేక.. అతడిని ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లింది. దీంతో వైద్యులు అతడికి సీటీ స్కాన్ చేశారు.  ఈ క్రమంలో రిపోర్టులు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఇరాన్‌(Iran)కు చెందిన ఓ వ్యక్తికి ప్రస్తుతం 50ఏళ్లు. అతడు కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో గడుపుతున్నాడు. అన్నం తినడానికి ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా మలబద్దకంతో కూడా అతడు బాధపడుతున్నాడని అతడి భార్య గమనించింది. ఈ నేపథ్యంలోనే భర్తను స్థానికంగా ఉన్న ఇమామ్ ఖోమేనీ హాస్పిటల్‌(Imam Khomeini Hospital )కు బలవంతంగా తీసుకెళ్లింది. అనంతరం వైద్యులకు తన భర్త పరిస్థితి వివరించింది. దీంతో డాక్టర్లు అతడికి సిటీ స్కాన్(CT scan) చేశారు. తర్వాత రిపోర్టులు చూసి వైద్యులు సహా అతడి భార్య విస్తుపోయింది. మలద్వారంలో 7.5 ఇంచుల పొడవైన వాటర్ బాటిల్‌ను(Water Bottle Stuck in Rectum) గుర్తించి డాక్టర్లు షాకయ్యారు. అనంతరం శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. 


కాగా.. ఆ బాటిల్‌ను సదరు వ్యక్తే లైంగిక సంతృప్తి కోసం మలద్వారంలో చొప్పించుకుని ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు. తాను చెసిన పని గురించి భార్యకు చెప్పుకోలేక.. నొప్పిని మౌనంగా భరించాడని పేర్కొన్నారు. లైంగికంగా అసంతృప్తితో ఉన్న వాళ్లు.. మార్కెట్‌లో దొరికే రకరకాల సెక్స్ టాయిస్‌(Sex Toys)లను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. అయితే.. ఇతడు మాత్రం.. లైంగిక సంతృప్తి( Sexual Gratification) పొందడానికి వాటర్ బాటిల్‌ను ఉపయోగించాడని వివరిస్తున్నారు. అయితే.. వైలీ లైబ్రరీ (Wiley Library) తన జర్నల్‌లో ప్రచురించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అదికాస్తా viral గా మారింది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.