ఇరాక్‌ కుర్ద్‌ ప్రాంతాలపై ఇరాన్‌ క్షిపణులు

ABN , First Publish Date - 2022-09-30T06:44:55+05:30 IST

రాన్‌లో రగిలిన హిజాబ్‌ వివాదం తాలూకు సెగలకు ఇరాక్‌ వేడెక్కుతోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌లో ఆందోళన చేస్తున్న నిరసకారులకు

ఇరాక్‌ కుర్ద్‌ ప్రాంతాలపై ఇరాన్‌ క్షిపణులు

13 మంది మృతి, 58 మందికి గాయాలు


టెహ్రాన్‌, సెప్టెంబరు 29: ఇరాన్‌లో రగిలిన హిజాబ్‌ వివాదం తాలూకు సెగలకు ఇరాక్‌ వేడెక్కుతోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌లో ఆందోళన చేస్తున్న నిరసకారులకు మద్దతునిస్తున్న కుర్దిష్‌ గ్రూప్‌లపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రెవల్యూషన్‌ గార్డ్‌ కోర్‌ (ఐఆర్జీసీ) క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. మరో 58 మంది గాయపడ్డారు. ఇటీవల ఇరాన్‌లో హిజాబ్‌ సరిగ్గా ధరించలేదన్న అభియోగాలపై 22 ఏళ్ల ఆమిని మహ్సాని పోలీసులు అరెస్టు చేయగా ఈనెల 16న కస్టడీలో ఆమె మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. వారికి ఇరాక్‌లోని ‘వేర్పాటు వాద ఉగ్రవాదులు’ మద్దతిస్తున్నారని, అందుకే క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించామని ఐఆర్జీసీ ప్రకటించింది. కాగా ఇరాన్‌లో అరాచకాలను సృష్టిస్తున్న  వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెచ్చరించారు.  

Updated Date - 2022-09-30T06:44:55+05:30 IST