అత్యంత విలువైన ఇండియన్ బ్యాటర్ ఎవరో చెప్పేసిన Irfan Pathan

ABN , First Publish Date - 2022-05-08T00:26:52+05:30 IST

ఐపీఎల్ (IPL)లో ఈసారి కొత్తగా అడుగుపెట్టిన రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్

అత్యంత విలువైన ఇండియన్ బ్యాటర్ ఎవరో చెప్పేసిన Irfan Pathan

ముంబై: ఐపీఎల్ (IPL)లో ఈసారి కొత్తగా అడుగుపెట్టిన రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) అద్భుతంగా రాణిస్తున్నాయి. టైటాన్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా, లక్నో జట్టు 10 మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలతో రెండో స్థానంలో ఉంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. 451 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 


 ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా నిలకడగా పరుగులు సాధిస్తున్న రాహుల్‌ ప్రస్తుతం ‘అత్యంత విలువైన ఇండియన్ బ్యాటర్లలో ఒకడని’ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఏ స్థానంలో అయినా అతడు బ్యాటింగ్ చేయగలడని ప్రశంసించాడు. టీమిండియాకు కూడా అతడు అదే చేశాడని, నైపుణ్యం ఉంటేనే అది సాధ్యమవుతుందని అన్నాడు. ఏ పొజిషన్‌లో అయినా బ్యాటింగ్ చేయగల సమర్థుడు కాబట్టే అతడు అత్యంత విలువైన ఇండియన్ బ్యాటర్లలో ఒకడిగా మారాడని అన్నాడు.  


చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా (Suresh Raina) కూడా రాహుల్‌పై ప్రశంసలు కురిపించాడు. రాహుల్ సానుకూల మనస్తత్వంతో బ్యాటింగ్ చేస్తాడని కొనియాడాడు. అద్భుతమైన షాట్లు ఆడతాడని, రాహుల్ కెరియర్ ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉందని రైనా పేర్కొన్నాడు.  

Read more