పీలేరు మండల సమాఖ్యను సందర్శించిన ఐఆర్‌ఎంఏ బృందం

ABN , First Publish Date - 2022-08-11T04:43:34+05:30 IST

గుజరాత్‌ రాష్ట్రం ఆనంద్‌ నగరానికి చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌ మెంట్‌ ఆనంద్‌(ఐఆర్‌ఎంఏ)’ సంస్థకు చెందిన అధ్యయ న బృందం బుధవారం పీలేరు మండల సమాఖ్యను సందర్శించింది.

పీలేరు మండల సమాఖ్యను సందర్శించిన ఐఆర్‌ఎంఏ బృందం
పీలేరు మండల సమాఖ్య సభ్యులతో మాట్లాడుతున్న ఐఆర్‌ఎంఏ బృంద సభ్యులు

పీలేరు, ఆగస్టు 10: గుజరాత్‌ రాష్ట్రం ఆనంద్‌ నగరానికి చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌ మెంట్‌ ఆనంద్‌(ఐఆర్‌ఎంఏ)’ సంస్థకు చెందిన అధ్యయ న బృందం బుధవారం పీలేరు మండల సమాఖ్యను సందర్శించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ రూరల్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) దేశ వ్యాప్తంగా గుర్తించిన అత్యంత ప్రభావశీల మండల సమాఖ్యల్లో పీలేరు కూడా ఉండడంతో ఐఆర్‌ఎంఏ బృందం ఇక్కడికి విచ్చేసింది. ఐఆర్‌ఎంఏకు చెందిన ప్రొఫెసర్‌ శంభు ప్రసాద్‌ నేతృత్వంలో తమిళనాడుకు చెందిన ప్రశాంత్‌, తెలంగాణకు చెందిన వేణుమాధవ్‌, వెంకటరమణతో కూడిన బృందం  పీలేరు మండల, గ్రామ సమాఖ్య సభ్యులతో సమావేశమయ్యారు. అనం తరం సమాఖ్య సభ్యులు అనుసరిస్తున్న పొదుపు పద్ధతులు, రికార్డులు,  సమావేశాల నిర్వహణ, రుణా లు అందించే విధానాలు,  చెల్లింపులు, స్వయం సహా యక సంఘాల్లో చేరిన తరువాత వారి జీవితాల్లో మార్పులు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజులపాటు పీలేరులోనే ఉండి మరింత లోతుగా అధ్యయనం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ రూతు, ఏపీఎంలు లక్ష్మణ్‌ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, సీసీలు రాఘవరెడ్డి, బాబు, నరసిం హులు, రామచంద్ర, రమశ్‌, అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T04:43:34+05:30 IST