ప్లాటు.. పాట్లు!

ABN , First Publish Date - 2021-06-20T04:59:26+05:30 IST

పాలమూరు-రం గారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్‌ కింద ముంపునకు గురవుతున్న బండరావిపాకుల నిర్వాసితుల ప్లాట్ల కేటాయింపులో వి వాదం తలెత్తింది.

ప్లాటు.. పాట్లు!
విడిగా వద్దని డిప్‌ పద్ధతిలో ప్లాట్లు కేటాయించాలని సమావేశమైన ఎస్సీలు

- వివాదంలో ఏదుల ప్లాట్ల కేటాయింపు

- డిప్‌ ద్వారా ఇవ్వాలని చెబుతున్న ప్రభుత్వ ఉత్తర్వులు

- ఎస్సీలకు ఒక దగ్గర ఇచ్చేందుకు ప్రయత్నాలు 

- ప్రత్యేకంగా కేటాయించొద్దని ఎస్సీల తీర్మానాలు


వనపర్తి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు-రం గారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్‌ కింద ముంపునకు గురవుతున్న బండరావిపాకుల నిర్వాసితుల ప్లాట్ల కేటాయింపులో వి వాదం తలెత్తింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డిప్‌ ప ద్ధతిలో ప్లాట్లు కేటాయించాల్సి ఉండగా, కులాల వారీగా ప్లాట్ల కేటాయింపునకు ప్రయత్నాలు జరుగుతుండటం పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్‌అండ్‌ఆర్‌ కింద గౌరి దేవిపల్లి వద్ద ఇప్పటికే కాలనీకి అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి. ప్లాట్ల కేటాయింపు పూర్తి చేసి, గ్రామాన్ని త రలించడమే తరువాయి అనుకున్న దశలో ప్లాట్లను కే టాయించడంలో రచ్చ నెలకొంది. మూడు రోజులుగా ప్లాట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఊరి సంప్రదాయం ప్రకారం ఎ స్సీలకు వేరుగా ప్లాట్లను కేటాయించాలని ఆర్‌అండ్‌ఆర్‌ కమిటీ డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఎలాంటి చట్టబద్ధత లేని ఆర్‌అండ్‌ఆర్‌ కమిటీ ప్లా ట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవడం, దాన్ని అధికా రులు సమర్థించడం సరికాదనే అభిప్రాయం ఆ ఊరి ఎ స్సీ వర్గాల నుంచి వస్తోంది. 


ఇదీ నేపథ్యం

ఏదుల రిజర్వాయర్‌ కింద కొంకలపల్లి, బండరావిపా కుల గ్రామాలు మునకకు గురవుతున్నాయి. ప్రాజెక్టుకు కావాల్సిన 4,380 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించి, నిర్మాణ పనులను దాదాపు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ ర్‌అండ్‌ఆర్‌ సెటిల్‌మెంట్‌ ప్రక్రియ నడుస్తోంది. గతంలో బోగస్‌ లబ్ధిదారుల పేర్లు జాబితాలో రాగా, ప్రస్తుతం వాటిని అధికారులు తొలగించారు. వివాహం అయిన వారికి రూ.12.50 లక్షల చొప్పున, 18 సంవత్సరాలు నిం డిన వారికి రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నారు. అయి తే, ప్లాట్ల కేటాయింపు ఆర్‌అండ్‌ఆర్‌ జాబితా ప్రకారం జరగనుంది. మొత్తం 978 కుటుంబాలకు సంబంధించి 1,558 మంది లబ్ధిదారులతో గతంలో జాబితా విడుద లైంది. ప్రస్తుతం అందులో నుంచి దాదాపు 127 మంది అనర్హులను తొలగించారు. వారుపోను మిగితా వారంద రికీ ప్లాట్ల కేటాయింపు జరగనుంది. ఈ నేపథ్యంలో అ ధికారులు గౌరిదేవిపల్లి వద్ద ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని సి ద్ధం చేశారు. అనుకున్న దాని ప్రకారం గ్రామస్థులకు ప్లాట్ల కేటాయింపును డిప్‌ పద్ధతిలో చేయాల్సి ఉం టుంది. అయితే, భవిష్యత్‌లో వివాదాలు తలెత్తకుండా అధికారులు సామరస్యంగా ప్లాట్లను కేటాయించేందుకు ఆర్‌అండ్‌ఆర్‌ కమిటీ, ఊరి పెద్దలను అభిప్రాయం కోరి నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ కమిటీ అభిప్రాయాలే వి వాదానికి కారణమవుతున్నాయి.


మూఢాచారంతోనే ఇబ్బందులు

సామాజిక వివక్ష తొలగించాలనే ఉద్దేశంతో ప్రభు త్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. అయినా, గ్రా మాల స్థాయిలో ఇంకా ఆ వివక్ష తొలగిపోవడం లేదు. ఇందుకు బండరావిపాకుల ప్లాట్ల కేటాయింపునే ఉదా హరణగా చెప్పొచ్చు. గతంలో పాత ఊరిలో కులాల వారీగా కాలనీలు ఉన్నాయి. ముఖ్యంగా అనాదిగా ఎస్సీ కాలనీలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడందరూ కలిసిపో యేందుకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ రూపంలో అవకాశం ఏ ర్పడింది. కానీ, గ్రామంలోని కొంత మంది పెద్దలు, ఆర్‌ అండ్‌ఆర్‌ కమిటీలు పాత ఊరు ఎలా ఉందో అలా కా లనీలను విభజించి, ఆ తర్వాత డిప్‌ పద్ధతిలో వేర్వేరు గా ప్లాట్లను కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోం ది. ఇదీ ఆ గ్రామంలోని ఎస్సీ వర్గాలకు ఇబ్బందిగా మా రింది. తమను ప్రత్యేక కాలనీగా ఏర్పాటు చేయడం త గదని, ఊరంతా ఒకేచోటగా.. ప్లాట్లను డిప్‌ పద్ధతిలో కే టాయించాలని కోరుతున్నారు. రెండు మూడు సార్లు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించినప్పటికీ వివాదం స మసిపోవడం లేదు. దాదాపు 250 జనాభా కలిగిన ఎస్సీ లందరూ డిప్‌ పద్ధతిలో కేటాయించాలని శుక్రవారం తీ ర్మానం కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో అధికారుల పాత్ర ప్లాట్ల కేటాయింపులో కీలకం కానుంది.

Updated Date - 2021-06-20T04:59:26+05:30 IST