కయ్యం

ABN , First Publish Date - 2021-02-22T04:40:13+05:30 IST

ఆర్‌‘ఢీ’ఎస్‌పై తెలంగాణలోని అలంపూర్‌, ఏపీలోని రాయలసీమ ప్రాంతాల మధ్య నీటి వాటాల విషయంలో ఏళ్లుగా కొట్లాట జరుగుతూనే ఉంది..

కయ్యం
ఆర్డీఎస్‌ అనకట్ట (ఫైల్‌)

- ఆర్డీఎస్‌పై మరో మారు రాజుకుంటున్న వివాదం

- ఆనకట్ట ఎగువన కుడి వైపు కాల్వను నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వం

- బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన పాత తీర్పు సాకుతో సన్నాహం

- రూ.2 వేల కోట్లను మంజూరు చేసి పనులకు శ్రీకారం

- డీపీఆర్‌ను సిద్ధం చేసి టెండర్లకు ఆహ్వానం

- తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల అనుమతులు లేకుండానే నిర్ణయం

- ఎడారిగా మారనున్న తెలంగాణలోని తుంగభద్ర నది పరివాహక ప్రాంతం

- కాల్వ పూర్తయితే ‘తుమ్మిళ్ల’కు గడ్డుకాలం

- ఎడమ కాల్వ నుంచి ఇప్పటికే అలంపూర్‌ ప్రాంతానికి నీరు రాక అన్యాయం

- ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ రైతుల ఆగ్రహం


(గద్వాల-ఆంధ్రజ్యోతి) : ఆర్‌‘ఢీ’ఎస్‌పై తెలంగాణలోని అలంపూర్‌, ఏపీలోని రాయలసీమ ప్రాంతాల మధ్య నీటి వాటాల విషయంలో ఏళ్లుగా కొట్లాట జరుగుతూనే ఉంది.. కొన్ని సందర్భాల్లో ఈ రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణలూ చోటు చేసుకున్నాయి.. తాజాగా మరో సారి ఏపీ ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతోంది.. 1995లో బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చిందంటూ, ఆనకట్ట ఎగువన కొత్త కాల్వ నిర్మాణానికి శ్రీకారం చుట్టి వివాదానికి తెరలేపింది.. తుంగభద్ర నది నుంచి నాలుగు టీఎంసీల నీటిని తరలించడానికి కోస్గి మండలం సాతనూరు, ఐతనూరు వద్ద కాల్వ పనులకు ముగ్గు పోయించింది.. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాల అంగీకారం లేకుండానే సైలెంట్‌గా ఈ తంతును సాగిస్తోంది.. తాజాగా ఈ విషయం బయట పడటంతో ఏపీ ప్రభుత్వ తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి..

ఆర్డీఎస్‌ ఎడవ కాల్వ కింద కర్ణాటకలోని 40 వేల ఎకరాలకు, తెలంగాణ రాష్ట్రం అలంపూర్‌ ప్రాంతంలోని 87,500 ఎకరాలకు సాగునీరు అం దించాల్సి ఉన్నది. ఇందులో తెలంగాణ ప్రాంతా నికి 15.9 టీఎంసీల నీటి వాటా ఉంది. అయితే, 60 ఏళ్లుగా ఈ కేటాయింపులు తెలంగాణకు ద క్కడం లేదు. ఇందు కోసం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గ రైతులు పోరా టం చేస్తూనే ఉన్నారు. దీనికితోడు రెండు దశా బ్దాలుగా ఆనకట్టపై స్లూయిస్‌ రంధ్రాలను మూ యకపోవడం, సిల్ట్‌ను తీయకపోవడంతో ఎడమ కాల్వకు నీరు రావడం లేదు. ఆర్డీఎస్‌కు ప్రతి ఏటా వరదలు వస్తున్నా, కేవలం మూడు నుంచి నాలుగు టీఎంసీల నీరు మాత్రమే అందుతోంది. దీంతో 87,500 ఎకరాలకు సాగునీరు అందడం గగనంగా మారగా, ప్రస్తుతం పది వేల ఎకరాల కు కూడా సాగునీరు రావడం కష్టంగా మారింది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఆర్డీఎస్‌ ఎగువన కుడి వైపు కొత్త కాల్వ నిర్మాణానికి పూ నుకున్నది. కర్నూల్‌ జిల్లా కోస్గి మండలం సాతనూరు, ఐతనూరు ప్రాంతాలల్లో ఉన్న తుంగభ ద్ర నది నుంచి కాల్వను తవ్వడానికి ముగ్గు పోసింది. నది నుంచి దాదాపు 160 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణానికి టెండర్లను పూర్తి చే సింది. ఈ కాల్వ నీటితో రెండు చోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూపొందించిన డీపీఆర్‌ను అమలు చేయడానికి, దాదాపు రూ.2 వేల కోట్ల ను మంజూరు చేసింది. కోస్గి నుంచి కర్నూల్‌ వరకు కాల్వతో నీటిని తీసుకొని నది పరివాహక గ్రామాల ఆయకట్టును అభివృద్ది చేయడానికి స న్నాహాలు చేస్తోంది. అయితే, ఈ కాల్వ నిర్మాణం జరిగితే దిగువన ఉన్న ఎడమ కాల్వకు నీరు అందడం ప్రశ్నార్థకంగా మారుతుంది. 


పరివాహక గ్రామాలకు ముప్పు

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త కాల్వతో అ లంపూర్‌ నియోజకవర్గంలోని తుంగభద్ర నది ప రివాహక గ్రామాలకు ముప్పు ఏర్పడనున్నది. ఈ నియోజకవర్గంలో అయిజ, రాజోలి, వడ్డెపల్లి, మానవపాడు, ఉండవల్లి, అలంపూర్‌ మండలా లు ఉండగా, దాదాపు 40 నుంచి 50 గ్రామాలు నదిపై అధారపడి ఉన్నాయి. అలాగే, రెండు ఎ త్తిపోతల పథకాలు, మూడు రక్షిత మంచినీటి పథకాలకు తుంగభద్ర నది నీరు ఆధారం. అయి తే, ఆర్డీఎస్‌ కాల్వపై కొత్త కాల్వ నిర్మాణంతో నది ఎడారిగా మారే అవకాశంగా ఉంది.


తుమ్మిళ్లకు కష్టకాలం

ఆర్డీఎస్‌ నుంచి అలంపూర్‌ ప్రాంతంలోని చివరి ఆయకట్టు వరకు సాగు నీరు రావడం లేదని తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా దాదాపు 55 వేల ఎకరాలకు సాగునీరు అం దించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పథకం మొదటి దశ పనులు పూర్తి కాగా, రెండో దశలో మూడు రిజర్వాయర్లను నిర్మించి నీటిని నిల్వ చేయాలని భా విస్తోంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్‌ ఎగువన కొత్త కాల్వ నిర్మాణం చేపట్టి నాలుగు టీఎంసీల నీటిని తీసుకోవాలని సిద్ధమైంది. ఈ కాల్వ పూ ర్తయితే దిగువకు నీరు రాదు. దీంతో ఆర్డీఎస్‌ ఎడమ కాల్వల నుంచి, తు మ్మిళ్ల నుంచి సాగునీరు వచ్చే అవకాశం ఉండదు.


బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ ఏం చెప్పింది

1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాల కోసం నాలు గు టీఎంసీల నీటి కేటాయింపులు చేయాలని అప్పటి ప్రభుత్వం బ్రి జేష్‌ ట్రైబ్యునల్‌ను కోరింది. ట్రైబ్యునల్‌ కూడా నాలుగు టీఎంసీల నీటిని తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే, ఈ నీటిని తుంగభద్ర నది నుంచి కాకుండా, కృష్ణానది నుంచి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందు కోసం ముందుగా ఆర్డీఎస్‌ను బ్యారేజీగా ఆధునీకరించాలని చెప్పింది. ఆ తరువాత ఆల్మట్టి నుంచి నాలుగు టీఎంసీల కృష్ణానది నీటిని ఆర్డీఎస్‌కు తరలించి, ఆ నీ టినే వాడుకోవాలని స్పష్టం చేసింది. అయితే, బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చి దా దాపు 27 ఏళ్లు అవుతోంది. ట్రైబ్యునల్‌ రద్దై కృష్ణా రివర్‌ బోర్డు, తుంగభద్ర రివర్‌ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఈ నదులపై కాలువలు, ప్రాజెక్టులు చేపట్టాలంటే ముం దుగా ఈ బోర్డుల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఈ నదులు పారే తెలంగాణ, క ర్ణాటక ప్రభుత్వాలు కూడా ఇందుకు అంగీకారం చెప్పాలి. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు మేరకు, ఏపీ ప్రభుత్వ కాల్వ నిర్మాణానికి సిద్ధం కావడం వివాదా స్పదంగా మారింది.

Updated Date - 2021-02-22T04:40:13+05:30 IST