‘ఆయకట్టు పెంచేందుకు కృషి’

ABN , First Publish Date - 2021-10-27T04:42:14+05:30 IST

మద్దికెర గ్రామంలో ఎంతో విస్తీర్ణం గల యజ్ఞం చెరువు కింద ఆయకట్టు పెంచేందుకు కృషి చేస్తామని జిల్లా ఇరిగేషన్‌ లిఫ్ట్‌ డీఈఈలు లక్ష్మీకాంతరెడ్డి, కేశవరెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఆర్‌.వెంకటేశ్వర్లు అన్నారు.

‘ఆయకట్టు పెంచేందుకు కృషి’

మద్దికెర, అక్టోబరు 26: మద్దికెర గ్రామంలో ఎంతో విస్తీర్ణం గల యజ్ఞం చెరువు కింద ఆయకట్టు పెంచేందుకు కృషి చేస్తామని జిల్లా ఇరిగేషన్‌ లిఫ్ట్‌ డీఈఈలు లక్ష్మీకాంతరెడ్డి, కేశవరెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఆర్‌.వెంకటేశ్వర్లు అన్నారు. మద్దికెర గ్రామంలోని యజ్ఞం చెరువు, మద్దమ్మకుంటలను మంగళవారం పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మద్దికెర గ్రామంలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా యజ్ఞం చెరువుకు హంద్రీనీవా ద్వారా నీరు తరలించి 200 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడానికి ప్రతిపాదనలు కూడా తయారు చేస్తామని తెలిపారు. అలాగే యజ్ఞం చెరువు నుంచి శాశ్విత నీటి పరిష్కారం కోసం మద్దికెర మద్దమ్మకుంటకు నీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తామన్నారు. మండలంలోని లింగాలవాగు డ్యాం చెరువు కూడా హంద్రీ నీవా ద్వారా నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. మద్దికెర పరిసర ప్రాంతాల్లో హంద్రీనీవా కాలువ వెళ్లుతున్నా నీరు ప్రజలు అందలేక పోతున్నాయని, అందువల్ల ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు. లిఫ్ట్‌ ద్వారా మద్దికెరకు హంద్రీనీవాతో నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. మద్దమ్మకుంటలో పుష్కలంగా నీరు ఉండడం వల్ల మద్దికెర గ్రామ ప్రజలకు నీటి సమస్య ఉండదని, అందువల్ల మద్దమ్మకుంట పూడిక తీత పనులు చేపట్టి నీటిని వదులుతామని తెలిపారు. మాజీ సర్పంచ్‌ కొత్తపేట వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లికార్జునయాదవ్‌, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, తహసీల్దార్‌ నాగభూషణం, ఎంపీడీవో నరసింహమూర్తి, ఎంపీటీసీలు ఆంజనేయులు, చిట్టి, పంచాయతీ సలహదారుడు బండారు ఆంజనేయులు, వైసీపీ నాయకులు రామాంజనేయులు, కృష్ణ, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T04:42:14+05:30 IST