‘కృష్ణా’.. నీవే కనవా!

ABN , First Publish Date - 2020-11-30T03:59:10+05:30 IST

శ్రీశైలం డ్యాం నిర్వహణపై కృష్ణా రివర్‌ బోర్డులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు జగడానికి దిగా యి.

‘కృష్ణా’.. నీవే కనవా!
అక్టోబరులో శ్రీశైలం నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు

- ఉనికి కోల్పోయే ప్రమాదంలో శ్రీశైలం డ్యాం

- తెలుగు రాష్ట్రాల మధ్య ఏళ్లుగా జల జగడం

- భారీ వరదలతో ప్రాజెక్టుపై పెరుగుతున్న నీటి ఒత్తిడి

- నిర్వహణ బాధ్యత ఎవరిదనే విషయంలో పేచీ

- తక్షణం మరమ్మతులు చేయాలంటున్న నిపుణుల కమిటీ

- రూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు రెడీ


నాగర్‌కర్నూల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం డ్యాం నిర్వహణపై కృష్ణా రివర్‌ బోర్డులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు జగడానికి దిగా యి. ఈ నేపథ్యంలో డ్యాం భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 2009లో వచ్చిన వరదలు, ఈ ఏడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా డ్యాంకు తక్షణం మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీన్ని గుర్తు చేస్తూ నిపుణుల కమిటీ ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు తెలిసింది. ప్రాజె క్టు వద్ద తక్షణం చేయాల్సిన మరమ్మతు పనులకు దాదాపు వెయ్యి కోట్లు ఖర్చ వుతుందని అంచనాలు కూడా రూపొందించాయి. ఈ మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలని కూడా నివేదికను రూపొందించినట్లు విశ్వసనీయ వ ర్గాల ద్వారా తెలిసింది.


భారీ వరదలతో ముప్పు


భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంలో నీటి ఒత్తిడి క్రమంగా పెరుగు తుంది. 2009లో భారీ వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా కర్నూల్‌ నీట మునిగింది. ప్రాజెక్టు నిండి గేట్లపై నుంచి కూడా వరద నీరు ప్రవహించింది. అప్పట్లో ప్రాజెక్టులోని రెండు గేట్ల కింది భాగంలో ఏర్పడిన గోతులను డ్యాం అధికారులు గుర్తించారు. తక్షణం మరమ్మతులు చేపట్టకుంటే డ్యాం ఉనికి ప్ర శ్నార్థకంగా మారుతుందని సూచించారు. 2009 తర్వాత చోటు చేసుకున్న వి విధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చలేదు. భారీ వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుపై నీటి ఒత్తిడి ఉండకుండా ప్రత్యామ్నాయంగా రెండో స్పిల్‌వేను నిర్మించాలని అప్పట్లో ప్రతిపాదన రావడం గమనార్హం. ఈ ఏడాది గత నెలలో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో తొమ్మిది సార్లు ఎత్తారు. భారీగా వరద నీటిని దిగు వకు వదలడంతో కూడా ప్లంజ్‌పూల్‌లో గోతులు ఏర్పడ్డాయని సాగునీటి శాఖ నిపుణులు అంటున్నారు.


స్పష్టత రాకుంటే ఉనికి ప్రశ్నార్థకమే..


ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకునే విషయంలో తెలంగాణ, ఏపీ పేచీ పడుతున్న నేపథ్యంలో శ్రీశైలం డ్యాం నిర్వహణ బాధ్యత ఎవరిదనే విషయం లో కచ్చితమైన నిర్ణయం తీసుకోకుంటే అనర్థాలు తప్పవని ఇంజనీరింగ్‌ ని పుణులు అభిప్రాయపడ్తున్నారు. ప్రాజెక్టు ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలు సాగు, తాగునీటి అవసరాలతో పాటు జలవిద్యుత్‌ ఉత్పాదన చేపడుతున్నా యి. ఈ క్రమంలో కృష్ణా రివర్‌ బోర్డు నిర్ణయం ఎలా ఉంటుందో, నిర్వహణ బాధ్యతలు ఏ రాష్ట్రానికి అప్పగిస్తారో స్పష్టత లేకుంటే, రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టు నిర్వహణకు భారీ మొత్తంలో నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కేవలం నిర్వహ ణ పరమైన లోపాల కారణంగా శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ ఉత్పాదన కేంద్రంలో మంటలు చెలరేగడం, మహత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథ కం నీట మునగడం లాంటి సంఘటనలను గమనంలోకి తీసుకుంటున్న జిల్లా వాసులు, శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకుం టే నష్టాలు చవిచూడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

Updated Date - 2020-11-30T03:59:10+05:30 IST