'ఐకాన్‌'లో అల్లు అర్జున్ ప్రయోగం..?

Jun 22 2021 @ 10:34AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా కొత్త ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'పుష్ప-1' షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఇది పూర్తికాగానే సెకండ్ పార్ట్ మొదలుపెట్టడానికి కాస్త టైమ్ పడుతుండటంతో, 'ఐకాన్' చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రస్తుతం కథలో కీలక మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అల్లు అర్జున్ చూపులేని వ్యక్తిగా కనిపిస్తారని, అందుకే 'ఐకాన్' టైటిల్‌కి 'కనబడటలేదు' అనే ట్యాగ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ అంధుడిగా నటించడం అంటే పెద్ద ప్రయోగమే. 

అయితే ఇందులో ఎంతవరకు నిజముందో మేకర్స్ స్పందిస్తే గానీ నమ్మలేము. ఇక ఇలా హీరో, హీరోయిన్స్ బ్లైండ్ రోల్స్‌లో  నటించడం కొత్తేమి కాదు. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ - యామీ గౌతం కలిసి నటించిన 'కాబిల్' చిత్రంలో ఇద్దరు గుడ్డివారిగా నటించారు. అలాగే 'అంధాదున్' సినిమాలో యువ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా నటించి ఆకట్టుకున్నాడు. అదే సినిమాని తెలుగులో నితిన్‌తో 'మాస్ట్రో'గా రూపొందిస్తున్నారు. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్న 'నెట్రికన్‌'లో ఆమె అంధురాలి పాత్రలో కనిపించబోతున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.