'పుష్పకవిమానం' ఓటీటీలోనా..?

Jun 16 2021 @ 07:54AM

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా 'పుష్పకవిమానం'. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దామోదర దర్శకత్వం వహించిన ఇందులో గీత్ సైని - శాన్వి మేఘన హీరోయిన్స్ నటించారు. విజయ్ దేవరకొండ సమర్పణలో 'కింగ్ ఆఫ్ ది హిల్' ప్రొడక్షన్ - టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రామ్ మిరియాల - సిద్దార్థ్ సదాశివుని - అమిత్ దాసాని సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీగా ఉందని సమాచారం. అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేసినా, వరుసగా పెద్ద సినిమాలు ఉండటం వల్ల 'పుష్పకవిమానం' వాటి మధ్య నిలబడుతుందా అనే సందేహం మేకర్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే మంచి సమయం చూసి ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. మరి మేకర్స్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.