సీఐడీ ప్రజల కోసమా.. జగన్‌ కోసమా..?

ABN , First Publish Date - 2022-10-02T06:28:08+05:30 IST

రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా, గంజాయి రవాణా, డ్రగ్స్‌ మాఫియా పెచ్చుమీరుతున్నా చర్యలు తీసుకునేందుకు ముందుకురాని పోలీసు, సీఐడీ వ్యవస్థలు టీడీపీ నాయ కులపై అక్రమ కేసులు, దాడులు, అరె స్టులు చేస్తుండడం సిగ్గుచేటని తెలు గుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు.

సీఐడీ ప్రజల కోసమా.. జగన్‌ కోసమా..?
పాయకరావుపేటలో అనిత, టీడీపీ శ్రేణుల కొవ్వొత్తుల ప్రదర్శన

 హైదరాబాద్‌లో విజయ్‌ ఇంటి వద్ద సదరు అధికారుల తీరు ఆశ్చర్యకరం 

 తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత, టీడీపీ శ్రేణులు ఆగ్రహం

పాయకరావుపేట, అక్టోబరు 1 : రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా, గంజాయి రవాణా, డ్రగ్స్‌ మాఫియా పెచ్చుమీరుతున్నా చర్యలు తీసుకునేందుకు ముందుకురాని పోలీసు, సీఐడీ వ్యవస్థలు టీడీపీ నాయ కులపై అక్రమ కేసులు, దాడులు, అరె స్టులు చేస్తుండడం  సిగ్గుచేటని తెలు గుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. హైదరాబాద్‌లో మాజీ మంత్రి చింత కాయల అయ్యన్నపాత్రుడు తన యుడు విజయ్‌ ఇంటి వద్ద శనివారం సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరుకు నిరసనగా పాయకరావుపేటలో టీడీపీ నాయకులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో సీఐడీ తీరును చూస్తుంటే ప్రజల కోసం పనిచేస్తుందా, లేక  జగన్‌ కోసం పని చేస్తు న్నదా.. అన్నది అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ మండల అధ్య క్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, పట్టణ అఽధ్యక్షులు పెదిరెడ్డి శ్రీను తదితరులు పాలొ ్గన్నారు.

మునగపాక : హైదరాబాద్‌లో ఉన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ ఇంటిపైకి వైసీపీ ప్రభుత్వం సీఐడీ పోలీసులను పంపి దౌర్జన్యం చేయించడం అన్యాయమని నాగులాపల్లిలో శనివారం రాత్రి ఆ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఐటీడీపీ మండల అధ్యక్షుడు శరగడం యోగి నాగేశ్వరరావు ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డి శ్రీని వాసరావు, నాయకులు పొలమరశెట్టి నాగు,  పెతకంశెట్టి రాజు, సత్యనారాయణ,  మురళీ,  ప్రకాష్‌ పాల్గొన్నారు. 

ఎలమంచిలి : పట్టణంలో శనివారం రాత్రి టీడీపీ శ్రేణులు కాగడాలతో  నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ ఇంటిపై ఆంధ్ర సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసగా ఈ ఆందోళన చేపట్టినట్టు  మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గొర్లె నానాజీ, ఆడారి రమణబాబు, ఆడారి ఆదిమూర్తి, కొఠారు సాంబ, కౌన్సిలర్‌ మజ్జి రామకృష్ణ, బి.శ్రీనివాసరావు, భద్రరావు, గొర్లె బాబూరావు, కరణం రవి, ఎన్‌.సుబ్బయ్యనాయుడు, బి.రమణబాబు, కోటిబాబు, జి.రాము, సాగర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T06:28:08+05:30 IST