చరణ్ సినిమాలో నలుగురు సూపర్‌స్టార్స్.. శంకర్ ప్లాన్‌కి మైండ్ బ్లాకవుతోందట.?

Apr 22 2021 @ 08:28AM

శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్న పాన్ ఇండియన్ సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకి రాబోతోందని తెలుస్తోంది. శంకర్ సినిమా అంటే భారీ తారాగణంతో కళ్ళు చెదిరిపోయే విజువల్ వండర్‌గా రూపొందిస్తాడని తెలిసిందే. శంకర్ నుంచి వచ్చే ప్రతీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది. కాగా శంకర్ - చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో నలుగు సూపర్ స్టార్స్ నటిస్తున్నారా.. అవుననే మాట వినిపిస్తోంది. డైరెక్టర్ శంకర్ కథని ఆ స్థాయిలో రెడీ చేస్తున్నాడట. 

 

ప్రస్తుతం శంకర్ స్పీడ్ పెంచాడు. ఎప్పుడు లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలని కమిటవుతున్నాడు. కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉండగానే రామ్ చరణ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో అపరిచితుడు హిందీ రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ మరొక హీరోగా నటిస్తున్నాడు. ఇక సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలోనూ చరణ్ ఆచార్య సినిమాను చేస్తున్నాడు.

చరణ్ సిద్ద పాత్రలో తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ మీద సందడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే.. చరణ్‌కి జంటగా నటిస్తుండగా.. రీసెంట్‌గా ఇద్దరి కాంబినేషన్‌లో సాంగ్ కంప్లీట్ చేశారు. కాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం నలుగు సూపర్ స్టార్స్‌ని ఎంపిక చేయనున్నట్టు వార్త ఒకటి వైరల్ అవుతోంది. తెలుగులో మెగాస్టార్ గానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హిందీలో సల్మాన్, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో ఉపేంద్ర గానీ సుదీప్ గానీ నటించే అవకాశాలున్నాయట. ఇదే నిజమైతే చరణ్ కెరీర్‌లో ఇలాంటి గొప్ప సినిమా మళ్ళీ రాకపోవచ్చంటున్నారు. చూడాలి ఇందుకు సంబంధించిన అధికారకమైన ప్రకటన మేకర్స్ నుంచి ఎప్పుడు వస్తుందో.  

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.