సలహా ఇస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసా?

ABN , First Publish Date - 2021-05-09T04:59:13+05:30 IST

ఒక వ్యాధిపైన సలహా ఇస్తే నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేయిస్తారా అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సలహా ఇస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసా?
నిరసన వ్యక్తం చేస్తున్న రెడ్యం, దేశం నేతలు

వ్యాధిని కట్టడి చేయలేకే... : రెడ్యం

ఖాజీపేట, మే8: ఒక వ్యాధిపైన సలహా ఇస్తే నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేయిస్తారా అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుంపలగట్టులోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ సర్కా ర్‌ వ్యాక్సిన్‌ ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతూ మాస్క్‌ లు ధరించి భౌతికదూరం పాటిస్తూ శనివారం నిరసన దీక్ష చేపట్టిన ఆయన మాట్లాడుతూ

కరోనా వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం అనేక రాషా్ట్రలు పోటీ పడుతుంటే సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రం సరఫరా చేసే వ్యాక్సిన్‌లపైనే ఆధారపడడం సిగ్గుచేటన్నారు. కరోనా పేషెంట్లకు బెడ్స్‌, ఆక్సిజన్‌, సరైన భోజన వసతి కల్పించడంలో జగన్‌ సర్కార్‌కు చేతకావడం లేదన్నారు. టీడీపీ నేతలు రెడ్యం నాగేశ్వరరెడ్డి, ఇండ్ల వెంకటరెడ్డి, తప్పెట క్రిష్ణారెడ్డి, బండి వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T04:59:13+05:30 IST