అప్పు ఎగ్గొట్టిన వ్యక్తికి అందలమా..?

ABN , First Publish Date - 2022-08-18T04:00:04+05:30 IST

సహకార బ్యాంక్‌లో అప్పు ఎగవేత దారునిగా జాబాతాలో పేరున్న వ్యక్తికి ఆ బ్యాంకు పరిధిలోని సహకార సంఘానికి అధ్యక్షుడిగా నియమించడం ఎంత వరకు సమంజసమని వైసీపీ మండల నాయకుడు ఆనికాళ్ల ఈశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

అప్పు ఎగ్గొట్టిన వ్యక్తికి అందలమా..?
మాట్లాడుతున్న ఈశ్వర్‌రెడ్డి

సొంత ఊరు వారికి దక్కని అవకాశం

మాట తప్పిన ఎమ్మెల్యే కుందురు

వైసీపీ నేత ఈశ్వర్‌రెడ్డి ఆవేదన

పొదిలి రూరల్‌ ఆగస్టు 17 : సహకార బ్యాంక్‌లో అప్పు ఎగవేత దారునిగా జాబాతాలో పేరున్న వ్యక్తికి ఆ బ్యాంకు పరిధిలోని సహకార సంఘానికి అధ్యక్షుడిగా నియమించడం  ఎంత వరకు సమంజసమని వైసీపీ మండల నాయకుడు ఆనికాళ్ల ఈశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధ వారం మార్కాపురం అడ్డరోడ్డులో విలేకరుల సమా వేశంలో ఆయన మా ట్లాడారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాదాల వారి పాలెం అఽధ్యక్ష పదవిని ఇ స్తానని మాటతప్పారని ఆయన ఆరోపిం చారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదని ఈశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశా రు. సహకార సంఘంలో డిఫాల్టర్‌గా జాబితాలో పేరు ఉన్న పులి బ్ర హ్మారెడ్డికి అధ్యక్ష పదవి ఎలా  ఇచ్చారని నిలదీశారు.  సహకార సం ఘంలో రుణం ఉంటేనే పోటీ చేసేందుకు అనర్హుడన్న విషయం తెలి యదా అని ప్రశ్నించారు. 40 సంవత్సరాల క్రితం మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు రైతుల సౌకర్యార్ధం కోసం మాదాలవారిపాలెం సీఏసీ ఎస్‌ను ఏర్పాటు చేసుకున్నామని అయితే అప్పటి నుంచి తొలిఏడాది మాత్రమే దామిరెడ్డి చిన్నపరెడ్డికి మాత్రమే అవకాశం కల్పించారన్నారు. ఆ తరువాత ఏళ్లు గడుస్తున్నా సొంత ఊరికి అవకాశం కలింపచక పోవడం అన్యాయమన్నారు. గత రెండు నెలలుగా నాకు అధ్యక్ష పదవి ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే కుందురు బ్రహ్మారెడ్డిని నియమించడం సరికాదన్నారు. తనకు ఇస్తానని నమ్మబలికి తర్వాత మోసం చేయడం ఆవేదనకు గురిచేసిందన్నారు. గ్రామానికి చెందిన వ్కక్తి అవకాశం కల్పిం చకపోవడంపై మరో పక్క స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్త మవుతున్నాయి.  ప్రస్తుతం ఒకేపంచాయతీకి చెందిన వారికి రాముల వీడు శ్రీరాములు, చాగంటి మాలకొండయ్య, పులి బ్రహ్మారెడ్డికి ఇవ్వ డంపై మాదిరెడ్డిపాలెం గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి 2016లో సొసైటీలో లోను తీసుకొని చెల్లించలేదని తెలిపారు. 2022 12వ తేదీన ఎమ్మెల్యే నుంచి ఉత్తర్వుల పత్రం తీసుకున్నా రెండు రోజుల్లో అదే సొసైటీకి చెందిన ఉద్యోగి ద్వారా వెళ్లి చెలింలచారని గుర్తు చేశారు. అంతే కాకుండా 29-1-2016లో బ్రహ్మా రెడ్డిపై   డిక్రీ జారీ చూశారని తెలిపారు. అనంతరం రూ.57590కి 972- 2017-18, 6-3-2018న ఈపీ ఫైల్‌ చేశారన్నారు. అలాంటి వ్యక్తికి సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్ష పదవిని ఎలా కట్టబెడతారని ఈశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులు అఽధికారులు స్పందించి బ్ర హ్మారెడ్డిని తొలగించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికా రులపై కూడా చర్యలు తీసుకోవాలని ఈశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

 

Updated Date - 2022-08-18T04:00:04+05:30 IST