రోజూ యోగా, స్కిప్పింగ్ చేయడం మంచిదేనా?

Published: Fri, 01 Oct 2021 14:00:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రోజూ యోగా, స్కిప్పింగ్ చేయడం మంచిదేనా?

ఆంధ్రజ్యోతి(01-10-2021)

ప్రశ్న:  నాకు పదిహేను సంవత్సరాలు. రోజూ యోగా, స్కిప్పింగ్‌ చేస్తాను. ఇలా యోగా చేయడం మంచిదేనా? ఆరోగ్యంగా ఉండడానికి ఏ ఆహారం తీసుకోవాలి?


- సాహితి, నిర్మల్‌


డాక్టర్ సమాధానం: చిన్న వయసు నుంచే రోజూ యోగా, స్కిప్పింగ్‌ లాంటి  వ్యాయామాలు చేయడం చాలా మంచిది. అయితే ఈ వ్యాయామాలు పరిమితిలోనే చేయాలి. అలాగే, శారీరక శ్రమకు, వయసుకు తగినట్లు ఆహారం తీసుకోవాలి. ఈ వయసులో పిల్లలకు ప్రొటీన్‌ అవసరం ఎక్కువ. రోజూ గుడ్లు, పాలు, పెరుగు, అన్ని రకాల పప్పులు (కంది, పెసర, శనగ మొదలైనవి) తీసుకోవడం ద్వారా ప్రొటీన్లు పొందవచ్చు. మాంసాహారం తినేవారైతే చికెన్‌, చేప, మటన్‌ తదితరాలు నూనె తక్కువ వేసి వండినవి వారానికి రెండు సార్లు తీసుకోవచ్చు. విటమిన్లు, ఖనిజాల కోసం తాజా పండ్లు, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు ఆహారంలో తప్పని సరిగా భాగం కావాలి. కేవలం అన్నం, రొట్టెలు మాత్రమే కాకుండా వాటితో పాటు కూర, పప్పు ఎక్కువగా తీసుకోవాలి. చాక్‌లెట్లు, బిస్కెట్లు, చిప్స్‌, శీతలపానీయాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌ మొదలైనవి ఆరోగ్యానికి హాని చేస్తాయి కాబట్టి వీటికి బదులుగా పండ్లు, మొలకెత్తిన గింజలు, బఠాణీలు, శనగలు, మరమరాలు, మొక్కజొన్న పేలాలు, ఇంట్లో తయారు చేసిన రొట్టెలు, శాండ్విచ్‌ మొదలైన వాటిని అల్పాహారంగా తీసుకుంటే బాగుంటుంది. బాదం, ఆక్రోట్‌ లాంటి గింజల్లో ఉండే ఆవశ్యక ఫ్యాటీయాసిడ్లు మెదడు చురుగ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. సమయానుసారం ఆహారం తీసుకోవడం, వేళకు తగినంత నిద్రపోవడం కూడా మంచి ఆరోగ్యానికి అవసరం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.