బిగ్ బాస్‌కి కమల్ దూరం ..?

Jun 15 2021 @ 11:21AM

విశ్వనటుడు కమల్ హాసన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి  దూరం కానున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇండియాలోనే అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌ని స్టార్ మా నిర్వహిస్తోంది. హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా 14 సీజన్స్ అవగా.. తెలుగు, తమిళంలో 5వ సీజన్‌కి రంగం సిద్దం అవుతోంది. తెలుగులో మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్.టి.ఆర్, రెండవ సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించగా, మూడవ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. 5వ సీజన్‌కి ఇక్కడ నాగార్జున హోస్ట్ అంటున్నారు. ఇక తమిళంలో ముందునుంచి కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. అయితే 5 సీజన్స్‌కే షో నిర్వాహకులతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్టు..ఈ 5వ సీజన్ తర్వాత కమల్ బిగ్ బాస్‌కి గుడ్‌బై చెప్పబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ మాత్రం ఇటు కమల్ నుంచి గానీ, అటూ షో నిర్వాహకుల నుంచి రాలేదు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో. ప్రస్తుతం కమల్ లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో  'విక్రమ్' అనే సినిమా చేస్తున్నారు.    

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.