భూములివ్వటమే రైతులు చేసిన పాపమా?

ABN , First Publish Date - 2021-07-27T05:27:20+05:30 IST

కాలువలకు, రోడ్ల నిర్మాణానికి రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వటమే పాపంగా మారిందని, తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములు నేడు నిషేధిత జాబితాలోకి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సమస్యల కుప్పగా తప్పుల తడకగా మారిన ధరణి వెబ్‌సైట్‌పై సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

భూములివ్వటమే రైతులు చేసిన పాపమా?
భూసమస్యలపై తహసీల్దార్‌తో మాట్లాడుతున్న భట్టి

 అసెంబ్లీలో నిషేధిత భూ సమస్యలపై  గళం వినిపిస్తా

 సమస్యల కుప్పగా మారిన ధరణి

 సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క

 రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అన్నదాతల ఏకరువు

చింతకాని/బోనకల్‌ జులై 26: కాలువలకు, రోడ్ల నిర్మాణానికి రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వటమే పాపంగా మారిందని, తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములు నేడు నిషేధిత జాబితాలోకి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సమస్యల కుప్పగా తప్పుల తడకగా మారిన ధరణి వెబ్‌సైట్‌పై సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో కొత్తగా రేషన్‌ కార్డుల మంజురైన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేసే కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజుతో కలసి పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం ముందు నుంచే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్‌ నాయకులు, పలువురు రైతులు నిషేధిత భూసమస్యను పరిష్కరించాలని కోరుతూ అధికారులను నిలదీశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో సభ కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో కలగజేసుకున్న భట్టి  రైతులు తమ సమస్యలను స్టేజీ మీదకు వచ్చి చెప్పాల్సిందిగా కోరడంతో సమస్య సద్దుమనిగింది. పలువురు రైతులు తమ సమస్యలను భట్టి, కమల్‌రాజు ఎదుట విన్నవించారు. సుమారు గంట పాటు రైతుల సమస్యలు విన్న సీఎల్పీ నాయకుడు భట్టి సమస్యలపై స్పందించాల్సిందిగా తహసీల్దార్‌కు సూచించారు. నిషేఽధిత భూసమస్యల పరిష్కారం తన పరిధిలో లేదని కలెక్టర్‌ పరిధిలో ఉందని భూసమస్యలపై వచ్చిన దరఖాస్తులన్నీ జిల్లా అధికారులకు పంపించామన్నారు. అనంతరం భట్టి మాట్లాడుతూ ఽప్రభుత్వం భూసమస్యల పరిష్కారం కోసం ప్రారభించిన ధరణి వెబ్‌సైట్‌ తప్పుల తడకగా మారిందన్నారు. కుంట భూమి పోతేనే రైతుల తీవ్ర ఆందోళన చేందుతారని అలాంటిది ఎన్నో ఏండ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూములు నేడు నిషేధిత జాబితాలోకి వెళ్తే రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. నిషేధిత భూమలు సమస్యపై శాసనసభలో గళం విప్పి సమస్య పరిష్కారానికి మార్గం చూపిస్తానని తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని కిషోర్‌, వైస్‌ ఎంపీపీ గురజాల హనుమంతరావు,రైతుబంధు మండల కన్వీనర్‌ కిలారు మనోహర్‌బాబు,తహసీల్దార్‌ తిరుమలాచారి, ఎంపీడీవో రవికుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుల్లయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి,రైతుబంధు జిల్లా సభ్యులు మంకెన రమేష్‌, సొసైటీ చైర్మన్‌ కొండపల్లి శేఖర్‌రెడ్డి, అధికారులు,సర్పంచ్‌లు,ఎంపీటీసీలు, కాంగ్రె్‌స, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఫబోనకల్‌: సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొనేందుకు కృషిచేస్తామని సీఎల్పీ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌లు తెలిపారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఆహారభద్రత కార్డులు, కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీలో వారు పాల్గొన్నారు. మండలంలో అర్హులైన 491మందికి రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. సమస్యలపై వినతిపత్రాలను పలువురు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చిత్తారు నాగేశ్వరరావు, వైస్‌చైర్మన్‌ జంగా రవి, ఆత్మ చైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు, జడ్పీటీసీ మోదుగు సుధీర్‌, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, తహసీల్దార్‌ రాధిక, ఎంపీడీవో శ్రీదేవి, వైస్‌ఎంపీపీ గుగులోతు రమేష్‌, సర్పంచ్‌లు భూక్యా సైదానాయక్‌, కొమ్మినేని ఉపేందర్‌, వేణు, జెర్రిపోతుల రవి, రైతుబంధు మండల కన్వీనర్‌ వేమూరి ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T05:27:20+05:30 IST