'లైగర్' టీజర్ రెడీ చేస్తున్నాడా..?

Aug 12 2021 @ 11:20AM

'లైగర్' టీజర్ రెడీ చేస్తున్నాడా..? ప్రస్తుతం అవుననే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'లైగర్'. 'సాలా క్రాస్ బ్రీడ్' అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నీ సినిమాల నుంచి ఏదో ఒక అప్‌డేట్ వస్తున్నప్పటికీ 'లైగర్' నుంచి మాత్రం ఈ మధ్య ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్‌గా ఉన్నారు. అందుకే 'లైగర్' టీజర్‌ను వదిలి ఖుషీ చేయాలని పూరీ టీం ప్లాన్ చేస్తోందట. ఇందులో భాగంగానే హీరో విజయ దేవరకొండ ఇంటినుంచే టీజర్‌కి డబ్బింగ్ చెబుతున్నాడని తెలుస్తోంది.

తాజాగా ఆయన సోషల్ మీడియా ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ''మీ అబ్బాయి తిరిగి వచ్చాడు - వర్క్ ఫ్రమ్ హోమ్.. విషయాలను కదిలిద్దాం'' అని విజయ్ ట్వీట్ చేస్తూ.. ఓ ఫోటోని షేర్ చేశాడు. ఇందులో ఆయన మైక్ ముందు నిలబడి ఒక చేతిలో కాఫీ కప్ పట్టుకొని.. మరో చేతిలో డైలాగ్ పేపర్ పట్టుకొని చదువుతూ కనిపించాడు. దాంతో ఇది గ్యారెంటీగా 'లైగర్' టీజర్ కోసమే.. అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పూరీ కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరీ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.