మాధవన్ ఉన్నట్టా లేనట్టా..?

Apr 18 2021 @ 15:55PM

మాధవన్ ఈ మధ్య కాలంలో ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. కొంతమంది హీరోలకి సీనియారిటీ వచ్చే కొద్ది హీరో అవకాశాల కోసమే కాకుండా మంచి పాత్రలు తమ వరకు వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకుంటున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడు జగపతిబాబు ఈ తరహాలోనే గొప్ప గొప్ప పాత్రలను చేస్తూ క్రేజీ స్టార్‌గా మారాడు. ఇక కోలీవుడ్‌లో టాలెంటెడ్ నటుడు విజ సేతుపతి కూడా ఒకవైపు హీరోగా నటిస్తూ మరొక వైపు మంచి క్యారెక్టర్స్‌ని చేస్తున్నాడు. ఇటీవల ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఈ లిస్ట్‌లో ఆర్ మాధవన్ కూడా ఉన్నాడు. కాగా మాధవన్‌కి తెలుగులో సరైన బ్రేక్ రావడం లేదు. ఆయన చేసిన సినిమాలేవీ పెద్దగా సక్సస్ కావడం లేదు. 

 

దీంతో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందుకు కారణం మాధవన్ నటించిన సవ్య సాచి, నిశ్శబ్ధం సినిమాలు ఫ్లాప్‌గా మిగిలాయి. అయినా మాధవన్ పేరు టాలీవుడ్ పెద్ద సినిమాలకి పరిశీలిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకి మాధవన్ పేరు పరిశీలిస్తున్నారట. అయితే ఆయన నటించిన గత చిత్రాల రిజల్ట్ చూసి మాధవన్‌ని తీసుకోవాలా వద్ద అని మేకర్స్ కాస్త ఆలోచిస్తున్నారట. చూడాలి మరి విజయ్ సేతుపతి వైపే టాలీవుడ్ మేకర్స్ మొగ్గు చూతారా లేదా నెగిటివ్ సెంటిమెంట్ బ్రేక్ చేసి మాధవన్‌కి అవకాశం ఇస్తారా. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.