అమరుల త్యాగానికి విలువేదీ?

ABN , First Publish Date - 2021-07-26T06:49:54+05:30 IST

1999వ సంవత్సరం జూలై నెలలో పాకిస్థాన్‌ బరితెగించి కార్గిల్‌ ఆక్రమణకు పాల్పడగా ఇండియన్‌ ఆర్మీ వీరోచితంగా పోరాడి తిప్పికొట్టింది. ఈ భీకర యుద్ధంలో జిల్లావాసులు సైతం భాగస్వామ్యమై ఇద్దరు అమరులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నగదుతో పాటు, వ్యవసాయ భూమి, ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది.

అమరుల త్యాగానికి విలువేదీ?

కార్గిల్‌ పోరులో అసువులు బాసిన ఉమ్మడి జిల్లా వాసులు

అమలుకు నోచని ప్రభుత్వ హామీలు

దిక్కుతోచని స్థితిలో అమరుల కుటుంబాలు

నేడు కార్గిల్‌ విజయ్‌ దివస్‌


1999వ సంవత్సరం జూలై నెలలో పాకిస్థాన్‌ బరితెగించి కార్గిల్‌ ఆక్రమణకు పాల్పడగా ఇండియన్‌ ఆర్మీ వీరోచితంగా పోరాడి తిప్పికొట్టింది. ఈ భీకర యుద్ధంలో జిల్లావాసులు సైతం భాగస్వామ్యమై ఇద్దరు అమరులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నగదుతో పాటు, వ్యవసాయ భూమి, ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది. నగదు మాత్రం ఇచ్చినా భూమి, ఇల్లు హామీలు అలాగే మిగిలాయి. ప్రస్తుతం ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న అమరుల కుటుంబాలకు ప్రభుత్వ సాయంపై ఎదురుచూపులు తప్పడం లేదు. నేడు కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ప్రత్యేక కథనం..



శ్రీనివా్‌సరెడ్డి చిరస్మరణీయుడు 

త్రిపురారం, జూలై 25 : నల్లగొండ జిల్లా త్రిపురారం మం డలం కొణతాలపల్లి గ్రామానికి చెందిన మిట్ట సత్తిరెడ్డి, మణె మ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. శ్రీనివా్‌సరెడ్డికి చిన్ననాటి నుంచే దేశభక్తి మెండుగా ఉంది.  దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది. 18వ సంవత్సరంలోనే భారత సైన్యంలో అడుగుపెట్టాడు.. మీరట్‌లోని ఇన్‌ఫెంటరీ డివిజన్‌లో లాన్స్‌నాయక్‌గా విధులు నిర్వర్తించాడు. 1999సంవత్సరం జూలైలో కార్గిల్‌ యుద్ధం జరిగింది. మిలటరీ ట్రక్కులో సైన్యానికి ఆహార పదార్థాలు తీసుకెళుతుండగా  జూలై 7న  పాకిస్తాన్‌ సైన్యం ట్రక్కుపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివా్‌సరెడ్డిని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల పాటు చికిత్స పొంది పరిస్థితి విషమించడంతో మృతిచెందటంతో అదే నెల 12వ తేదీన శ్రీనివా్‌సరెడ్డి మృతదేహాన్ని స్వగ్రామం కొణాతాలపల్లికి తీసుకురాగా, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 22ఏళ్లకే మృత్యుఒడిలోకి చేరిన శ్రీనివా్‌సరెడ్డికి పెద్దసంఖ్యలో ప్రజలు నివాళులర్పించారు. శ్రీనివా్‌సరెడ్డి మృతితో అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆయన జ్ఞాపకార్థంగా సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కుటుంబానికి గ్రామంలో కేవలం  రెండు ఎకరాల పొలం మాత్రమే ఉంది. ప్రభుత్వం ఆరు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదు. పాత కాలం నాటి ఇల్లు కావడంతో  వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కుమార్తె వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నారు.. కనీసం రేషన్‌కార్డు, వృద్ధాప్య పింఛన్‌ రాకపోవడంతో బతుకు సాగడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దేశరక్షణ కోసం ప్రాణాలర్పించిన శ్రీనివా  ్‌సరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


కార్గిల్‌లో నేను సైతం: వెంకటేశం

వలిగొండ, జూలై 25 : కార్గిల్‌ యుద్ధ సమయంలో 150మందిని సురక్షిత ప్రాంతానికి తరలించానని యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎదుల్లగూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల వెంకటేశం తెలిపారు. నాటి ప్రతికూల పరిస్థితులను వివరించారు. ఆపరేషన్‌ విజయ్‌ దివ్‌స లో పాల్గొని విజయకేతనం ఎగురవేసిన సైనికుల్లో ఒకరిగా ఉండి రాష్ట్రం గర్వించదగ్గ సైనికుడిగా వెంకటేశం ప్రశంసలు అందుకున్నారు. 1991 ఫిబ్రవరి 27న సైన్యంలో చేరిన వెంకటేశం బెంగుళూరులో శిక్షణ ముగించుకొని శ్రీనగర్‌లో మొదటి పోస్టింగ్‌ చేశాడు. ఆర్మీ సర్వీసింగ్‌ కోర్డిస్‌ (ఏఎస్సీ) ట్రాన్స్‌పోర్ట్‌ విభాగంలో డ్రైవర్‌గా నాలుగేళ్లు పనిచేశాడు. 1998-2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో విధులు నిర్వహిస్తున్న తరుణంలో పాకిస్థాన్‌తో ఆపరేషన్‌ విజ య్‌ దివస్‌ ప్రాంభమైంది. కమాండర్‌ ఆదేశం మేరకు వెంకటేశం ఆయుధ సా మాగ్రిని తీసుకుని 20 మంది సైనికులతో శ్రీనగర్‌కు బయలుదేరి వెళ్లా డు.  ఆయన కార్గిల్‌లో మూడు నెలల పాటు సేవలందిస్తూ తన టీం సభ్యుల సహకారంతో 150మంది సైనికులను సురక్షితంగా కాపాడారు. ఆ సమయంలో ఉమ్మ డి నల్లగొండ జిల్లాకు చెందిన సైనికుడు గోపయ్యచారి వీరమరణం పొందాడు. వీరజవాన్ల గెలుపునకు సూచిగా టైగర్‌ హిల్స్‌పై పతాకాన్ని ఆవిష్కరించారు. 22 సంవత్సరాల 4 నెలల పాటు భారత సైన్యంలో విధులు నిర్వహించారు.


గోపయ్యచారి వీరోచిత పోరాటం 

సూర్యాపేట, జూలై 25(ఆంధ్రజ్యోతి):  సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం చీదె ళ్ల గ్రామానికి చెందిన పోలోజు గోపయ్యచారి దేశరక్షణ కోసం 24ఏళ్ల క్రితం భారత సైన్యం లో చేరాడు. కొంతకాలం పాటు దేశ సరిహద్దుకు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు. 1999వ సంవత్సరంలో జరిగిన కార్గి ల్‌ పోరులో ప్రాణాలు వదిలాడు. దేశ రక్షణలో ప్రాణాలు పోగొట్టుకున్న గోపయ్యచారికి కేంద్ర ప్రభుత్వం లాన్స్‌నాయక్‌ బిరుదు ప్రకటించింది. ఆయన చేసిన పోరాటం దేశంతో పాటు జిల్లాకు ఎంతో పేరు తెచ్చింది. లాన్స్‌నాయక్‌ గోపయ్యచారి మృతి అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ప్రభుత్వం పలు రకాల సాయం అందించింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం ఇస్తానని హామీ ఇచ్చింది. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు.  


దేశ రక్షణకు ప్రాణాలర్పించడం గర్వకారణం   : పోలోజు శారద, గోపయ్యచారి భార్య

దేశరక్షణలో నా భర్త గోపయ్యచారి ప్రాణాలర్పిం చడం గర్వంగా ఉంది. ఆయన లేని లోటు పూడ్చలేనిది. కుటుంబాలను ఏళ్ల తరబడి వదిలి దేశ రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్న వారిని ప్రజలు, ప్రభుత్వాలు గుర్తించి ఆదుకోవాలి. సైనికులం టే గౌరవం పెరగాలి. నేటితరం యువత దేశ రక్షణలో భాగస్వాములు కావాలి. గోపయ్యచారి విగ్రహాన్ని సూర్యాపేటలో ఏర్పాటుచేస్తే బాగుంటుంది. 

   


Updated Date - 2021-07-26T06:49:54+05:30 IST