నభా నటేష్‌కి ప్లస్సా మైనస్సా..?

Jun 4 2021 @ 11:41AM

నభా నటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'మాస్ట్రో' ఆమెకి ప్లస్సా మైనస్సా అని చర్చించుకుంటున్నారట. అందుకు కారణం లేకపోలేదు. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురాన నటించిన 'అంధాదున్‌'కి తెలుగు రీమేక్‌గా 'మాస్ట్రో' రూపొందుతోంది. అవార్డ్ విన్నిగ్ మూవీ రీమేక్ కావడంతో దీని మీద తెలుగు ప్రేక్షకుల్లో బాగానే అంచనాలున్నాయి. అయితే ఎటొచ్చి నభా పాత్ర మీదే కొందరికి సందేహాలు కలుగుతున్నాయట. హిందీలో రాధిక ఆప్టే పోషించిన బోల్డ్ పాత్రలో నభా నటేష్ నటిస్తుండగా, అక్కడ పాత్రకి పెద్దగా స్కోప్ ఉండదు. ఎక్కువగా టబు పాత్ర మీదే కథ సాగుతుంది. ఆ పాత్రలో ఇక్కడ తమన్నా కనిపించబోతోంది. దాంతో నభా కంటే తమన్నా పాత్రకే ప్రాధాన్యం ఉంటుందని చెప్పుకుంటున్నారు. కథలో మార్పులు చేసి నభా పాత్రను గనక డెవలప్ చేస్తే ఆమెకి 'మాస్ట్రో' ప్లస్ అవుతుంది. లేదంటే మైనస్ అయ్యే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈమెకి 'మాస్ట్రో' ఏ మేరకు పేరు తెచ్చిపెడుతుందో.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.