'టక్ జగదీష్' రాబోతున్నాడా..?

Jun 15 2021 @ 14:31PM

నేచురల్ స్టార్ నాని నటించిన 'టక్ జగదీష్' రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారాం. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదల చేయాల్సింది. కరోనా కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూతపడటంతో పోస్ట్‌పోన్ చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో షూటింగ్స్ మొదలవుతున్నాయి. అలాగే రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలవుతున్నాయట. ఈ క్రమంలోనే నాని 'టక్ జగదీష్' చిత్రాన్ని జూలై 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. వాస్తవంగా ఈ తేదీన ప్రభాస్ 'రాధేశ్యామ్' విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. దాంతో ఈ డేట్‌కి టక్ జగదీష్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఒకవేళ అనుకున్న డేట్‌కే 'రాధేశ్యామ్' వస్తే ఆగస్టు 20న ప్లాన్ చేస్తున్నారట. చూడాలి ఫైనల్‌గా 'టక్ జగదీష్' ఎప్పుడు రానున్నాడో.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.