నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..?

Jun 12 2021 @ 16:09PM

నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'నెట్రికన్'. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తాజా సమాచారం. గత ఏడాది నుంచి కొన్ని సినిమాలు థియేటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఓటీటీలో రిలీజ్ చేయాలంటే హీరో, హీరోయిన్‌ల అనుమతులు కూడా కొన్ని సినిమాలకి తీసుకోవాల్సి వస్తోంది. మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. అందుకే మేకర్స్ 'నెట్రికన్' రిలీజ్‌కి సంబంధించిన చర్చలు సాగిస్తున్నారట. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా, జనాలు థియేటర్స్‌కి ఎంతవరకు వస్తారో.. అనే సందేహాలుండటంతో ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారట. ఈ విషయం నయనతారతో చర్చించగా, తనవైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. దాంతో త్వరలో దీని రిలీజ్ డేట్‌ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా 'నెట్రికన్‌'లో నయన్ అంధురాలి పాత్రలో కనిపించబోతోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.