NRIలు భారత్‌లో Zero Balance Account ఓపెన్ చేయొచ్చా..?

ABN , First Publish Date - 2022-06-01T22:17:32+05:30 IST

ఒకప్పుడు డబ్బులనున్న వారికే బ్యాంకు ఖాతాలు ఉండేవి. కానీ తర్వాత కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ ఫలాలు నేరుగా లబ్ధిదారులకే చేరాలనే ఉద్దేశంతో జీరో బ్యాలెన్స్ అకౌంట్(Zero Balance Account)

NRIలు భారత్‌లో Zero Balance Account ఓపెన్ చేయొచ్చా..?

ఎన్నారై డెస్క్: ఒకప్పుడు డబ్బులనున్న వారికే బ్యాంకు ఖాతాలు ఉండేవి. కానీ తర్వాత కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ  ఫలాలు నేరుగా లబ్ధిదారులకే చేరాలనే ఉద్దేశంతో జీరో బ్యాలెన్స్ అకౌంట్(Zero Balance Account) సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ సౌకర్యం కేవలం ఇండియాలో నివసించే వారికేనా? విదేశాల్లో నివసించే భారతీయులకు ఇది వర్తించదా అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి.. 



ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఎవరైనా వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 183 లేదా అంతకంటే ఎక్కువ రోజులు విదేశాల్లో నివసిస్తే వారిని ఎన్నారైలుగా గుర్తింపు పొందుతారనే విషయం తెలిసిందే. దీని ప్రకారం విదేశాల్లో కూలి పనులు చేయడానికి వెళ్లిన వారు సైతం NRIలుగా పరిగణించబడతారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్లకోసమే ప్రభుత్వం.. ఎన్నారైలు కూడా ఇండియాలో Zero Balance Account ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని నిపుణులు అభిప్రాపడుతున్నారు. అయితే విదేశాలకు వెళ్లకముందే అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లిన తర్వాత జీరో అకౌంట్‌లో డబ్బులు వేస్తూ దాన్ని క్రియాశీలంగా ఉంచుకోవాలని అంటున్నారు. ఎవరైతే తమ జీరో అకౌంట్‌ను క్రియాశీలకంగా ఉంచుకుంటారో వారికే సంబంధిత బ్యాంకులు చెక్‌బుక్‌లను జారీ చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. 


Updated Date - 2022-06-01T22:17:32+05:30 IST