Viral News: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి రూ.5వేల ఆర్థిక సహాయం.. వైరల్ అవుతున్న మెసేజ్.. ఇందులో వాస్తవం ఎంతంటే!

ABN , First Publish Date - 2022-10-03T21:34:19+05:30 IST

కరోనా మహమ్మారి భారత్ సహా ప్రపంచ దేశాలను వణికించింది. వ్యాక్సిన్(Covid Vaccine) అందుబాటులోకి వచ్చిన తర్వాత మహమ్మారి ప్రభావం తగ్గిపోయింది. అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మెసేజ్ బాగా వైరల్ అవు

Viral News: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి రూ.5వేల ఆర్థిక సహాయం.. వైరల్ అవుతున్న మెసేజ్.. ఇందులో వాస్తవం ఎంతంటే!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి భారత్ సహా ప్రపంచ దేశాలను వణికించింది. వ్యాక్సిన్(Covid Vaccine) అందుబాటులోకి వచ్చిన తర్వాత మహమ్మారి ప్రభావం తగ్గిపోయింది. అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మెసేజ్ బాగా వైరల్ అవుతోంది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ.5వేల ఆర్థిక సహాయం అందిస్తుందనేది ఆ మెసేజ్ సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ మెసేజ్‌ను చూసి.. చాలా మంది నెటిజన్లు ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రభుత్వం నిజంగానే ఆర్థిక సహాయం చేస్తుందా? అసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్‌ను ఎంత వరకు నమ్మవచ్చు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా(Social Media)ను ప్రజలు విపరీతంగా ఉపయోగిస్తున్నారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలు ఎంత వరకు నిజం అని నిర్ధారించుకోకుండానే ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ‘కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పౌరులకు పీఎం జన్ కళ్యాణ్ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ ఆర్థిక సహాయం పొందాలంటే కేవలం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది’ అంటూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న మెసేజ్‌ను కూడా తెలిసిన వాళ్లకు షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ మెసేజ్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి దరఖాస్తును పూర్తి చేయాలని సూచిస్తున్నారు. 






ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) స్పందించింది. నెటింట వైరల్ అవుతున్న ఈ మెసేజ్‌ను ఫ్యాక్ట్ చెక్ చేసింది. అనంతరం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్త పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఆర్థిక సహాయం చేసేలా ప్రభుత్వం ఎటువంటి పథకాన్ని ప్రారంభించలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్‌ను నమ్మవద్దని తెలిపింది. మెసేజ్‌లోని లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. 

Updated Date - 2022-10-03T21:34:19+05:30 IST