Russia అధినేతగా తప్పుకోనున్న Putin?

ABN , First Publish Date - 2022-05-04T00:58:00+05:30 IST

ఒకవైపు Ukraine తో రెండు నెలలకు పైగా యుద్ధం కొనసాగుతోంది. అన్నీతానై ఈ యుద్ధ సన్నాహాలు చేశారు పుతిన్. ఇలాంటి సంక్షోభం వేళ పుతిన్ తప్పుకోవడం ఏంటని ప్రశ్నలు రావచ్చు. వాస్తవానికి పుతిన్ ఆరోగ్యం బాగా లేదని అనేక వార్తలు వస్తున్నాయి..

Russia అధినేతగా తప్పుకోనున్న Putin?

మాస్కో: రెండు దశాబ్దాలకు పైగా Prime minister గానో President గానో Russiaను ఏలుతున్న Vladimir Putin 2036 వరకు తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు రాజ్యాంగ సవరణ చేశారనే వార్తలు గట్టిగానే వినిపించాయి. అయితే ఈ సవరణ ఎలా ఉన్నప్పటికీ తన జీవితాంతం రష్యా అధినేతగా ఉండేందుకు పుతిన్ ఇష్టపడుతున్నారనే విషయం ఇన్నేళ్లుగా ఆయన రష్యాను ఏదో విధంగా ఏలుతున్న పరిణామాల్ని చూస్తే అర్థం అవుతోంది. 21వ శతాబ్దం రష్యా దేశాధ్యక్షుడంటే కేవలం పుతినే అన్నట్లుగా రష్యాలోని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉన్నట్టుండి ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఒకవైపు Ukraine తో రెండు నెలలకు పైగా యుద్ధం కొనసాగుతోంది. అన్నీతానై ఈ యుద్ధ సన్నాహాలు చేశారు పుతిన్. ఇలాంటి సంక్షోభం వేళ పుతిన్ తప్పుకుంటున్నారంటూ వార్తలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. పుతిన్ ఆరోగ్యం బాగా లేదని అనేక వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయనకు క్యాన్సర్ చికిత్స జరగవచ్చని, దాంతో తాత్కాలికంగా తన అధికారాన్ని మరొకరికి ఇచ్చేస్తారని Amrerica కు చెందిన ఒక వార్తా సంస్థ కథనం వెలువరించింది. దీనిపై Russia Govt కానీ, రష్యాకు చెందిన Media కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.


పుతిన్ చాలా అనారోగ్యంగా, అసాధారణంగా కనిపిస్తున్నారని, ఆయన పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ఆయనకు క్యాన్సర్ ఉందనే వార్తలు కూడా విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. రష్యన్ ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ నిర్వహిస్తున్నట్లు భావిస్తోన్న ఓ మీడియా సంస్థ పెట్టిన పోస్టును సదరు కథనాల్లో ప్రస్తావించారు. తన ఆరోగ్యం మరింత దిగజారితే.. దేశ నిర్వహణ బాధ్యతలు తాత్కాలికంగా పట్రుషేవ్ చేతుల్లోకి ఇచ్చేందుకు పుతిన్ ఒప్పుకున్నట్లు కథనంలో పేర్కొన్నారు.


గతంలో కూడా పుతిన్‌పై ఇలాంటి వార్తలే వచ్చాయి. ఇదే ఆరోగ్య సమస్యల కారణంగా పుతిన్ తొందరలోనే అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు 2020లో వార్తలు వచ్చాయి. ఇందుకు సాక్ష్యంగా అప్పట్లో ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. ఆ వీడియోలో పుతిన్‌ తరచూ తన కాలు అటూఇటూ కదుపుతున్నట్లు కనిపించింది. దీంతో ఆయన విపరీతమైన నొప్పి కారణంగానే కాలు కదుపుతున్నారని నిపుణులు పేర్కొన్నట్లు ఒక అంతర్జాతీయా మీడియా పేర్కొంది. దీనికి తోడు కుటుంబం నుంచి సైతం పుతిన్‌పై ఒత్తడి పెరిగిందని.. పుతిన్‌ ప్రియురాలు, మాజీ జిమ్నాస్ట్‌ అలినా కబేవా ఆయనను అధికార బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరినట్లు వార్తలు వినిపించాయి.

Read more