'మాస్టర్' హిందీలో రీమేక్ కోసం రెడీ అవుతున్న సల్మాన్..?

Jun 10 2021 @ 12:57PM

తమిళ స్టార్ విజయ్ హీరోగా ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించింది 'మాస్టర్'. లోకేష్ కనగ్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సల్మాన్ ఖాన్‌కి ఈ కథ బాగా నచ్చడంతో రీమేక్ చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ జరుగుతుండగా, ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. త్వరలో దీని దర్శకుడు సహా పూర్తి వివరాలు వెల్లడికానున్నాయని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇక సల్మాన్ నటించిన 'రాధే' ఇటీవల విడుదలై మంచి వసూళ్ళు రాబట్టింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.