
- ఐఎస్-ఖలీఫ్ పేరుతో వీడియో విడుదల..
- భారత్‌లో జిహాదే లక్ష్యమని వెల్లడి
- భారీగా భారతీయుల రిక్రూట్మెంట్
- వీడియోలో తుపాకుల శిక్షణ దృశ్యాలు
- పాక్ నుంచి టెలిగ్రామ్‌లో వీడియో
- ఆ వీడియో జమ్మూకశ్మీర్‌లో తీసిందే
- నిర్ధారించిన ఫోరెన్సిక్ నిపుణులు
- హైదరాబాద్‌లోనూ ఐఎస్ మూలాలు
- అబుధాబి మాడ్యుల్లో బాసిత్ కీలకం!
- విస్తరిస్తున్న ఐఎస్-హింద్ ప్రావిన్స్
- 2018లోనే ఐఎస్-జేకే చీఫ్ హతం
న్యూఢిల్లీ, మార్చి 27: భారత్‌లో విధ్వంసాలు, ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా జోరుగా రిక్రూట్మెంట్లు సాగిస్తున్నట్లు ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్ర సంస్థ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం టెలిగ్రామ్ చానల్లో ఓ వీడియోను విడుదల చేసింది. నాలుగు నిమిషాల నిడివిగల ఆ వీడియోలో భారత్‌లోని మూడు మాడ్యూల్స్(ఐఎ్‌స-ఖలీఫ్, ఐఎ్‌స-జేకే, ఐఎ్‌స-హింద్ ప్రావిన్స్) యాక్టివ్‌గా ఉన్నాయని, యువత రిక్రూట్మెంట్లు సాగుతున్నాయని అబూ తురాబ్-అల్-హింద్ అనే పేరుగల ఉగ్రవాది చెప్పుకొచ్చాడు. ముగ్గురు ఉగ్రవాదులు ముసుగులు ధరించి కనిపించారు. నిఘా వర్గాలు తమను గుర్తించకుండా వారు తమ కళ్లు స్పష్టంగా కనిపించకుండా చేశారు. ఇదే వీడియోలో కొందరు యువకులు పిస్టళ్లు, రివాల్వర్లు వంటి చిన్న ఆయుధాలతో శిక్షణ పొందుతున్న దృ శ్యాలున్నాయి.
చివర్లో ఆ 3 గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు ‘‘భారత్‌లో జిహాద్ చేస్తాం’’ అని ప్రతినబూనడం కనిపించిం ది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు ఈ వీడియోను విశ్లేషించాయి. గతంలో ఐఎ్సజేకే(జమ్మూకశ్మీర్) విడుదల చేసిన వీడియోలో యువకులు శిక్షణ పొందుతున్న పరిసరాలతో తాజా వీడియోలోని పరిసరాలకు సారూప్యత ఉన్నట్లు నిర్ధారించారు. జమ్మూకశ్మీర్‌లో తనిఖీలు, కార్డాన్ అండ్ సెర్చ్ ముమ్మరం కావడంతో మిలిటెంట్లు, ఉగ్రవాదులు ఏకే-47 లాంటి పెద్ద తుపాకులు కాకుం డా చిన్న తుపాకులను వినియోగిస్తున్నారు. గత ఏడాది కాశ్మీరేతర వ్యాపారుల హత్యలకూ రివాల్వర్లు, పిస్టళ్లనే వాడారు. ఐఎస్ విడుదల చేసిన తాజా వీడియోలోనూ అన్నీ చిన్న తుపాకు లే కనిపించాయని, దీన్ని బట్టి ఆ వీడి యో జమ్మూకశ్మీర్‌లో చిత్రీకరించినదే అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో మూలాలు!
దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా హైదరాబాద్‌లో మూలాలు బయటపడ డం తెలిసిందే! ఐఎ్‌సకేపీ(ఖురాసన్ ప్రావి న్స్), ఐఎ్సజేకే, అబూధాబి మాడ్యుల్‌కు హైదరాబాద్‌తో సంబంధాలున్నట్లు ఇప్పటికే తేలింది. 2015లో హైదరాబాద్ పాతనగరం చాంద్రాయణగుట్ట పరిధిలోని రియాసత్‌నగర్‌కు చెందిన ఐఎస్ ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్ అరెస్టుతో నగరంలో ఐఎ్‌స(అబుధాబి మాడ్యుల్) మూలాలు బయటపడ్డాయి. 2014 సెప్టెంబరులోనే అబ్దుల్లా బాసిత్, మరో ముగ్గు రు యువకులు ఐఎ్సలో చేరేందుకు వెళ్తూ కోల్‌కతాలో పట్టుబడ్డారు. హైదరాబాద్ పోలీసులు అప్పట్లో వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. 2015లో బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారుఖ్ హుస్సేని, మాజ్ హసన్ ఫారూఖ్‌ను జమ్మూకశ్మీర్ మీదుగా అఫ్ఘానిస్థాన్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. మహారాష్ట్ర ఏటీఎస్ బృందం వీరిని నాగ్‌పూర్‌లో అరెస్టు చేసింది. తర్వాత బాసిత్ బెయిల్‌పై బయటకు వచ్చినా ఐఎస్ భావజాలాన్ని విస్తరిస్తుండడంతో 2018లో ఎన్ఐఏ అరెస్టు చేసింది.
ప్రస్తుతం ఇత ను తిహార్ జైల్లో ఉన్నా.. దొంగచాటుగా స్మార్ట్‌ఫోన్ వాడుతూ ఐఎ్సను విస్తరిస్తున్నాడు. ఇతను నడిపే ఐఎస్ మాసపత్రిక ‘వాయిస్ ఆఫ్ హింద్’ ఆన్లైన్ ప్రచురణ కూడా కొనసాగుతోంది. 2018 డిసెంబరులో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి న నాగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు, అదే సంవత్సరం జూలైలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన కశ్మీరీ జంట కూడా బాసిత్ అనుచరగణమేనని ఎన్ఐఏ గుర్తించింది. 2019 ఏప్రిల్ 20న హైదరాబాద్ కింగ్స్ కాలనీలో ఎన్ఐఏ సోదాలు జరిపి నఫీజ్ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు హన్స్లను అరెస్టు చేసింది. వీరంతా ఐఎస్ అనుబంధ సంస్థ జునూద్ అల్ ఖలీఫా -ఎ-హింద్ సభ్యులని తేలింది.
జమ్మూకశ్మీర్‌లో ఖతం
జమ్మూకశ్మీర్ కేంద్రంగా భారత్‌లో విధ్వంసాలకు కుట్రపన్నిన ఐఎ్సజేకేను 2018లో భద్రతాబలగాలు మొక్క దశలోనే తుంచేశాయి. ఆ ఏడాది జూన్ 22న ఐఎ్సజేకే చీఫ్ దావూద్ అహ్మద్ సోఫీ అలియాస్ బుర్హాన్ ముజీబ్, అతని అనుచరులు ఆదిల్ రెహ్మాన్ భట్, మహమ్మద్ అష్రఫ్, మాజిద్ మంజూర్ దార్‌ను మట్టుబెట్టాయి. దీంతో ఐఎ్సజేకేను ఆదిలోనే కట్టడిచేసినట్లయింది. అయితే.. తాజాగా విడుదలైన వీడియోను జమ్మూకశ్మీర్‌లో చిత్రీకరించారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఐఎ్సజేకే మళ్లీ కార్యకలాపాలను కొనసాగిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో కశ్మీరీ ఐఎస్ జంట అరెస్టయ్యాక వారి విచారణలో పాక్‌లో శిక్షణ కొనసాగుతోందని తేలింది. అక్కడ 12 మంది భారతీయ యువకులు ఐఎస్ శిక్షణ పొందుతున్నట్లు నిర్ధారణ అయ్యింది.
ఒంటరి దాడులేనా?
తాజా వీడియోలో ఐఎ్‌స ఉగ్రవాదులంతా చిన్న తుపాకులతో ఉండడాన్ని బట్టి వారి లక్ష్యం ఒంటరి దాడులే(లోన్ వోల్ఫ్ అటాక్) అని స్పష్టమవుతోంది. అంటే.. ఒకసారి గ్రూపు నుంచి బయటకు వచ్చాక తమకు అప్పగించిన ప్రాంతంలో టార్గెట్ వర్గాలపై కాల్పులు జరిపి పారిపోవడమే లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పైస్థాయి నుంచి ఆదేశాల కోసం ఎన్క్రిప్టెడ్ ఫోన్‌కాల్స్ చేసినా నిఘా సంస్థలు గుర్తించే అవకాశాలున్నాయి. అందుకే ఎవరికి వారు లక్ష్యాలను నిర్ణయించుకుని, ఒంటరి తోడేలు దాడు లు చేసే ప్రమాదాలున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో కశ్మీరేతర వ్యాపారుల హత్యల సందర్భంలోనూ ఇదే పంథా కనిపించినట్లు గుర్తుచేస్తున్నాయి. కశ్మీరేతర వ్యాపారులను పిస్టల్, రివాల్వర్, తపం చా వంటి చిన్న తుపాకులతో మట్టుబెట్టి.. ఆయుధాన్ని దాచుకోవడమో, పారవేయడమో చేసి తాపీగా పోలీసుల ముందు నుంచే నడిచి వెళ్లొచ్చనే ఉద్దేశంతోనే ఉగ్రసంస్థలు ఈ తరహా దాడులను ఎంచుకుంటాయి. దశాబ్దం క్రితం హైదరాబాద్‌లో తహ్రీక్-ఎ-గల్బా ఇస్లాం పేరుతో ఉగ్ర సంస్థను ఏర్పాటు చేసిన వికార్ అహ్మద్, అతని అనుచరుడు సులేమాన్ పోలీసులపై ఇలాంటి దాడులే చేశారు.
