కరోనాకు అడ్డుకట్ట పడేనా?

ABN , First Publish Date - 2021-04-19T04:43:54+05:30 IST

జిల్లాలో కరో నా వైరస్‌ వ్యాప్తిని అధికారయంత్రాంగం కట్టడి చే యడం లేదు.

కరోనాకు అడ్డుకట్ట పడేనా?
గద్వాల పట్టణంలోని పాతబస్టాండ్‌ ప్రాంతాలో గుమిగూడిన ప్రజలు

- వాణిజ్య సంస్థల్లో నిబంధనలు బేఖాతరు

- ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్స్‌పై దృష్టి పెట్టని వైనం

 గద్వాల, ఏప్రిల్‌ 18 ( ఆంధ్రజ్యోతి):  జిల్లాలో కరో నా వైరస్‌ వ్యాప్తిని అధికారయంత్రాంగం కట్టడి చే యడం లేదు. గత ఏడాదిలాగా ట్రేసింగ్‌ చేయడం లే దు. ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్స్‌పై దృష్టి పెట్టడం లేదు. టెస్టులు పెంచినా కట్టడి లేకపోవడంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజురోజుకూ జి ల్లా కేంద్రంలో పాటు పలు గ్రామాలకు కరోనా వ్యాప్తి చెందుతోంది. శాఖల మఽధ్య సమన్వయం లేకపోవడం, గ్రామస్థాయిలో కట్టడి లేకపోవడం వల్ల కేసులు భారీ గా పెరుగుతున్నాయి.  జిల్లాలో వాణిజ్య సంస్థల్లో ని బంధనలు పాటించడం లేదు. మాస్కులు ధరించ కుండా వ్యాపారులు కొనసాగిస్తున్నారు. భౌతిక దూరం పాటించక పోవడం వల్ల వ్యాప్తి చెందుతోంది. కొన్ని వాణిజ్య సం స్థల్లో కనీసం శానిటైజర్‌ కూడా అందు బాటులో ఉంచడం లేదు. 

 ప్రధాన కూడళ్లలో  బందోబస్తు ఏర్పాటు చేయాలి

జిల్లాలోని మునిసిపాలిటీల్లో ప్రధానంగా చర్యలు చేపట్టాలి. గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తా, అం బేడ్కర్‌ చౌరస్తా, పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌, ఎస్‌బీ హెచ్‌, రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఆవరణ, ఆర్డీవో కార్యాలయం ప్రాంతాల్లో ఎక్కువమంది నిత్యం గూమిగూడుతున్నారు. కేవలం పిచ్చాపాటి ముచ్చట్లు పెట్టుకోవడానికి మాత్రమే వస్తున్నారు. బయటికి వచ్చే వారిలో దాదాపు 60శాతం మంది మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం అసలే లేదు. భయం వీడి జనం విచ్చలవిడిగా తిరుగుతున్నారు. హోటళ్లు, ఽథియేటర్లు, బార్లల్లో  నిబంధనలు గాలికివదిలేశారు. దీనిఫలితమే కేసులు పెరుగుతున్నాయి.   కేసులు ఎక్కడ పెరుగు తున్నాయో అక్కడి నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇంటింటికి తిరిగి కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలి యజేయడంతో పాటు బ్యానర్లు, హోర్డింగులు సైతం ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతును చేస్తే కొంతైనా కట్టడి చేయవచ్చు. అలాగే మునిసిపల్‌, పోలీ సులు జరిమానాలు వేసి వదిలివేయకుండా అవగా హన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 



Updated Date - 2021-04-19T04:43:54+05:30 IST