ప్రభుత్వానికి సూచనలిస్తే చంద్రబాబుపై కేసులా?

ABN , First Publish Date - 2021-05-09T06:25:52+05:30 IST

కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సూచన లిస్తే... తమ అధినేత చంద్రబాబునాయుడుపై కేసులు పెడ తారా అంటూ మాజీమంత్రి పరిటాలసునీత, టీడీపీ రాష్ట్ర అఽధి కార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నించారు.

ప్రభుత్వానికి సూచనలిస్తే చంద్రబాబుపై కేసులా?
వెంకటాంపురంలో నిరసన చేపట్టిన పరిటాలసునీత, పరిటాలశ్రీరామ్‌

-మాజీమంత్రి పరిటాల సునీత, యువనేత పరిటాల శ్రీరామ్‌

రామగిరి, మే8 : కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సూచన లిస్తే... తమ అధినేత చంద్రబాబునాయుడుపై కేసులు పెడ తారా అంటూ మాజీమంత్రి పరిటాలసునీత, టీడీపీ రాష్ట్ర అఽధి కార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నించారు. చంద్రబాబు ఇ చ్చిన పిలుపు మేరకు  శనివారం స్థానిక  సర్పంచ లలితమ్మ తో కలిసి వెంకటాపురంలోనే తమ స్వగృహంలో శాంతియు తంగా నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఆక్సిజన అందక ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే సీఎం జగన స్పందిస్తారని నిలదీఽశారు. జిల్లాలో రోజూ అనేక మంది చనిపోతున్నా తక్కు వ మరణాలు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీ పీ రంగుల కోసం రూ. 3వేల కోట్లు ఖర్చు చేసిన సీఎం జగన వ్యాక్సినకు రూ. 1600 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించా రు. మే 1 నుంచి పంపిణీ చేస్తామన్న వ్యాక్సిన ఏమైౖందన్నా రు. కొవిడ్‌ నియంత్రణకు పక్క రాష్ట్రాల సీఎంలు చేపట్టిన చ ర్యలు చూసి అయినా జగన నేర్చుకోవాలని హితవుపలికారు.


Updated Date - 2021-05-09T06:25:52+05:30 IST