Advertisement

రైతులందరికీ భరోసా అందేనా?

May 3 2021 @ 23:32PM
తేలుకుంచి ఆర్బీకేలో రైతుల వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది

13న రైతుల బ్యాంకు ఖాతాలో జమచేయడానికి సన్నాహాలు

ఇచ్ఛాపురం రూరల్‌ : అర్హులైనవారికి రైతు భరోసా అందుతుందోలేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. సాగులో పెరుగుతున్న పెట్టుబడుల దృష్ట్యా అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్‌ రైతుభరోసా, పీఎం కిసాన్‌ పథకం అమలుచేస్తున్నాయి. ఏటా భరోసా పేరిట రూ.13,500 చొప్పున జమచేస్తున్నాయి. 2021- 22 సంవత్సరానికి సంబంధించి రైతు భరోసా మొదటివిడత నగదు ఈనెల 13న జమచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సాంకేతిక చిక్కులతో వేలాది మంది ఈసాయానికి దూరమవుతు న్నారు. దీంలో భాగంగా అర్హులైన రైతుల వివరాల నమోదుచేయడంతోపాటు మార్పులు, చేర్పులకు గతనెల 30తో గడువు ముగిసింది.

జిల్లాలో 820 రైతు భరోసా కేంద్రాల ద్వారా గత ఏడాది 3,81,000 మంది రైతులకు రైతుభరోసా అందజేశారు. ప్రస్తుతం జిల్లాలో సాయం పొందుతున్న అన్నదాతల వివరాలతో కూడిన జాబితాలను రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. ఖాతా నెం బర్లతో ఆధార్‌ తప్పుగా మ్యాపింగ్‌చేయడం, బ్యాంకు ఖాతానంబర్లు సక్రమంగా లేకపోవడం, చనిపోయిన రైతుల స్థానంలో కుటుంబ సభ్యులకు నామినిలుగా గుర్తించడంలో జాప్యం చేయడం వంటి కారణాలతో గతఏడాది సుమారు 15 వేల మంది వరకు ఈ పథకానికి దూరమయ్యారు. తర్వాత వారీ నుంచి గ్రీవెన్స్‌ స్వీకరించినా చాలా మందికి అందలేదు.


ఖరీఫ్‌కు ముందు

ఏటా ఖరీఫ్‌ సీజన్‌కు ముందు మే నెలలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తొలివిడతగా రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తా యి. వచ్చేనెలలో అందనున్న ఈ సాయానికి సంబంధించి రైతుల అభ్యర్థనలను ముందుగానే పరిష్క రించాలని వ్యవసాయశాఖ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.


అర్హులందరికీ అందిస్తాం...

ఇప్పటివరకు భరోసా అందిన వారి జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించాం. ఇంకా అందనివా రుంటే దరఖాస్తు చేసుకోవాలని కోరాం. గతనెల 30 లోగా వచ్చిన వాటిని పరిష్కరిస్తాం. తప్పులు దొర్లిన వారికి మరో రెండుసార్లు అవకాశం ఇచ్చి వారికి జాబితాలో చేరుస్తాం. ఈనెల 13నవారి ఖాతాలకు సాయం అందేలా చర్యలు తీసుకుంటాం. రైతుల గ్రీవెన్స్‌పై మండలస్థాయిలో వ్యవసాయ సిబ్బంది ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఎవరూ ఆందోళన చెంద నవసరంలేదు. భరోసా అందరికీ అందుతుంది.

- కె.శ్రీధర్‌, వ్యవసాయశాఖ జేడీ


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.