
ఇది ఆటోనే.. కానీ అంతమంది ఉండేసరికి కనిపించలేదు. ఐదారుగురు ప్రయాణించాల్సిన ఈ ఆటోలో ఏకంగా 25 మందిని కుక్కేశారు. బండిఆత్మకూరు మండలం పెద్దదేవళాపురం శివారులో శనివారం కూలీలతో ఆత్మకూరు వైపు వెళ్తున్న ఈ ఆటోను చూసి అటుగా పోతున్న వారు ఆందోళన చెందారు. ఎక్కడైనా జారిపడితే ఏమైనా ఉందా అని భయం వ్యక్తం చేశారు.
- బండిఆత్మకూరు