ఊర్కొండకు పీహెచ్‌సీ కలేనా?

ABN , First Publish Date - 2021-05-10T03:47:42+05:30 IST

ఊర్కొండ మండల కేంద్రంగా ఏర్పాటైన పీహెచ్‌సీ లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఊర్కొండకు పీహెచ్‌సీ కలేనా?
ఊర్కొండలో బోర్డుకే పరిమితమైన పీహెచ్‌సీ

 - పీహెచ్‌సీ లేక ఇబ్బందులు పడుతున్న మండల వాసులు

 - ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని ప్రజల వేడుకోలు


ఊర్కొండ, మే 9: ఊర్కొండ మండల కేంద్రంగా ఏర్పాటైన పీహెచ్‌సీ లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మం డల వాసులు సుమారు 30 కి.మీ. ప్రయాణించి కల్వకుర్తి మండలంలోని తోటపల్లి పీహెచ్‌సీకి వెళ్లాల్సి వస్తుంది. ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా మండల కేంద్రంలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిదులు, అధికారులను మండలవాసులు కోరుతున్నారు. ఊర్కొండ మండలంలోని 16 గ్రామ పంచాయతీలు, 8 తండాలు, ఒక గూడెం ఉంది. మండల జనా భా 24 వేల వరకు ఉంటుంది. మండలంలోని గ్రామాల ప్రజలు వైద్యం కోసం కల్వకుర్తి, జడ్చర్ల, ఆమన్‌గల్లు వెళ్లాల్సి వస్తుండటంతో ప్రయాణ సౌకర్యాలు లేక తీవ్ర నిరాశకు గురువుతున్నారు. రాత్రి సమయాల్లో ఎవరికైనా ఏ ఆపద వచ్చిందంటే ప్రైవేటు వాహనాలకు భలే గిరాకీగా మారింది. వారి ఇష్టానుసారం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. నిరుపేదలకు వైద్యం అందక, సరియైున సమయంలో ఆసుపత్రికి వెళ్లలేక మృతవాత పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 


కరోనా కాలంలో పీహెచ్‌సీకి ప్రాధాన్యం ఏర్పడింది

కరోనా మహమ్మారికి గురై ఎందరో తీవ్ర నిరాశ నిస్పృహలోకి వెళుతున్నారు. తండాల్లో మరీ ప రిస్థితి ఇబ్బందిగా మారింది. వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు కల్పించాల్సిన ఏఎన్‌ఎం లు నిత్యం తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హాజరు వేసుకొని సుమారుగా 30 కి.మీ. ప్రయాణించి మండల ప్రజల ఆరోగ్య ప రీక్షలు చేయాల్సి వస్తుండటంతో వారు మానసి కంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా టీకా లు తీసుకోవాల్సి వస్తే తోటపల్లి పీహెచ్‌సీకి వెళ్లా ల్సి వస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌.సి.లక్ష్మారెడ్డి చొరవ తీసుకొని ఊర్కొండ పాఠశాలలో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఊర్కొండలో టీకాకే పరిమి తం కావడంతో కరోనా టెస్టులకు తోటపల్లికే వెళ్లాల్సి వస్తోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం 2017లో ఏర్పాటైనా ఇప్పటి వరకు పీహెచ్‌సీ ఏర్పాటు చే యకపోవడంతో మం డల ప్రజలలో అ సహనం వ్యక్తం అవు తున్నది. గతంలో పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సి.ల క్ష్మారెడ్డి పీహెచ్‌సీ కోసం స్థలాలను పరిశీ లించారు. అయినప్పటికీ స్థల పరిశీలిన ఆగిపోవడం తో ప్రజలు నిరాశ చెందుతు న్నారు. సంబంధిత ఉన్నతాధికారు లు, ప్రజాప్రతినిధులు స్పందించి పీ హెచ్‌సీ ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

 



Updated Date - 2021-05-10T03:47:42+05:30 IST