Parenting Tips : మీ పిల్లవాడు మొండిగా ఉన్నాడా? మీ మాట వినడం లేదా? ఈ చిట్కాలను పాటించండి.

ABN , First Publish Date - 2022-09-26T14:28:05+05:30 IST

ప్రతి తల్లిదండ్రులకు ఇప్పుడున్న అదిపెద్ద సమస్య పిల్లలు మాట వినకపోవడమే.. వారితో ప్రవర్తించడం రోజు రోజుకూ కష్టంగా మారిపోతుంది.

Parenting Tips : మీ పిల్లవాడు మొండిగా ఉన్నాడా? మీ మాట వినడం లేదా? ఈ చిట్కాలను పాటించండి.

ప్రతి తల్లిదండ్రులకు ఇప్పుడున్న అదిపెద్ద సమస్య పిల్లలు మాట వినకపోవడమే.. వారితో ప్రవర్తించడం రోజు రోజుకూ కష్టంగా మారిపోతుంది. ఇంలాంటి సమస్యను అతి సులువుగా పరిష్కరించే చిట్కాలను ఇప్పుడు చూద్దాం..


1. పిల్లల మీద అవరకండి..

పిల్లల మీద అరవకండి. మాట వినడం లేదని బలవంతం చేయకండి. ఎందుకంటే పిల్లల మీద అరవడం వల్ల వాళ్ళు ఆందోళకు గురవుతారు. దీనితో దూకుడుగా మారి, మొండిగా ప్రవర్తిస్తారు. వాళ్ళతో ప్రశాంతంగా ఉండి, నెమ్మదితనంతో మాట్లాడాలి. పదేపదే పిల్లలకు నువ్వు క్రమశిక్షణతో ఉండాలని,. చెప్పినట్లు వినాలి అంటూ బెదిరింపు ధోరణితో చెప్పటం వల్ల మరింత మొండిగా మారే అవకాశాలున్నాయి.


2. పిల్లల మాటలు పట్టించుకోండి..

బిజీ లైఫ్ లతో గజిబిజి సమయాలతో తల్లిదండ్రులు పిల్లలు చెప్పే కబుర్లు వినగలిగే స్థిమితం కోల్పోతున్నారు. అసలు పిల్లలు ఏం చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు చెప్పే చిన్న చిన్న ఫిర్యాదులు వినండి. వారికి సమయాన్ని ఇచ్చి చూడండి. పిల్లలు సహజంగానే తల్లిదండ్రులతో ఏదైనా పంచుకోవాలని చూస్తారు. చాలా సార్లు తల్లిదండ్రులు ఆ అవకాశాన్ని పిల్లలకు ఇవ్వరు. నిర్లష్యం చేస్తారు. ఈ ప్రవర్తన కారణంగా  పిల్లల్లో మొండితనం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


3. పిల్లలతో అన్నీ చెప్పండి.

మీ పిల్లల్లో చురుకుదనం పెరగాలంటే వాళ్లతో చాలా సేపు కబుర్లు చెప్పండి. మీ బాల్యాన్ని గురించిన కబుర్లు చెపుతూ ఉండండి. ఆసక్తి కరమైన కథలు, కబుర్లు పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. ఇలా చేయడం వల్ల మీతో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.


4. పోలిక...

మీ పిల్లల్ని ఇంకొకరితో పాల్చి చూడకండి. ఇది పిల్లల మనసులను గాయపరుస్తుంది. ప్రతి ఒక్కరూ మరొకరిలా ఉండరనే విషయాన్ని అర్థం చేసుకుని వారితో ఉండండి. ముఖ్యంగా బంధువులతో, స్నేహితుల పిల్లలతో పోల్చి వాళ్ళ ముందు చులకన చేయకండి. 


ఇవన్నీ తల్లిదండ్రులు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇవే పిల్లల్ని మొండిగా, పిరికిగా, మాట వినని వారిగా తయారు చేస్తాయి. పిల్లల మనసులకు తల్లిదండ్రులు చేసేదే కనిపిస్తుంది. స్కూల్, ఆటలు, చదువు ఒత్తిడుల మధ్య పిల్లలకు ఉన్న మరో ఆలంబన తల్లిదండ్రులే కాబట్టి వారిని మీకు తగ్గట్టుగా మీరే మలుచుకోవాలి.

Updated Date - 2022-09-26T14:28:05+05:30 IST