పొదల్లో జవాను మృతదేహం.. పక్కనే తుపాకీ.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2021-11-08T17:38:45+05:30 IST

పొదల్లో జవాన్ మృతదేహం.. పక్కనే తుపాకీ ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే విషయాన్ని అక్కడ ఉన్న అధికారులకు చేర వేశారు. దీంతో అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు

పొదల్లో జవాను మృతదేహం.. పక్కనే తుపాకీ.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ఇంటర్నెట్ డెస్క్: పొదల్లో జవాన్ మృతదేహం.. పక్కనే తుపాకీ ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే విషయాన్ని అక్కడ ఉన్న అధికారులకు చేర వేశారు. దీంతో అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విషయం ఏంటని ఆరా తీశారు. ఈ క్రమంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అందేంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని నాగౌర్ నగరానికి సమీపంలో ఉన్న ఈగ్యసాని గ్రామానికి చెందిన మంగీలాల్(55).. సెంట్రల్ ఇండ్రస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) విభాగంలో అడిషనల్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పై అధికారుల ఆదేశాల ప్రకారం ఎప్పటిలాగే ఘటమ్‌పూర్‌లోని పవర్ ప్లాంట్ వద్ద విధులు నిర్వర్తించేందుకు ఆదివారం కూడా వెళ్లాడు. అయితే అనూహ్యంగా సాయంత్రానికి అతను శవమై కనిపించాడు. పొదల్లో మంగీలాల్ మృతదేహాన్ని.. పక్కనే తుపాకీ గుర్తించిన స్థానికులు.. ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 



దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఫోరెన్సిక్ టీంతో సహా పోలీసులు రంగంలోకి దిగారు. మంగీలాల్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. పక్కనే ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్ధారించారు. మంగీలాల్ మరణ వార్తను విని.. అతడి కుటంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతేకాకుండా డిప్యూటీ కమాండెంట్ వేధింపుల వల్లే మంగీలాల్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2021-11-08T17:38:45+05:30 IST