మోదీ గైర్హాజర్ unparlimentary కాదా?: Jairam Ramesh

ABN , First Publish Date - 2022-07-17T21:57:20+05:30 IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కాకపోవడంపై..

మోదీ గైర్హాజర్ unparlimentary కాదా?: Jairam Ramesh

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి (All party meet) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) హాజరు కాకపోవడం(Absence)పై కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు తీవ్రం అభ్యంతరం తెలిపింది. సమావేశానికి మోదీ గైర్హాజర్ కావడం 'అన్‌పార్లమెంటరీ' (Unparliamentary) కాదా? అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశంలో చేపట్టబోయే అంశాలపై చర్చ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి సహజంగానే మోదీ గైర్హాజరయ్యారని, ఇది అన్‌పార్లమెంటరీ కాదా అని ఆయన ఓ ట్వీట్‌లో నిలదీశారు.


పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా అందరూ సహకరించాలనే విజ్ఞప్తితో పాటు, సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలపై మాట్లాడేందుకు పార్లమెంట్ హౌస్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈనెల 18న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీతో ముగుస్తాయి.


మంచిమనిషి ముప్పవరపు...

కాగా, ఉప రాష్ట్రపతిగా పదవీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న ముప్పవరపు వెంకయ్యనాయుడుపై జైరాం రమేష్ ప్రశంసలు గురించారు. ''మంచి మనిషి వెళ్లిపోతున్నారు'' అంటూ వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ పేరును ఎన్డీయే ప్రకటించిన నేపథ్యంలో జైరాం  రమేష్  మాట్లాడుతూ, రాజ్యసభలో తాను అనేక సందర్భాల్లో విపక్షాలతో కలిసి ఆందోళన చేపట్టినప్పటికీ.. ఒక మంచి మనిషి పదవీ బాధ్యతలు ముగించుకుని వెళ్లిపోతున్నారంటూ వెంకయ్యనాయుడును ఉద్దేశించి అన్నారు. ఆయన ఛలోక్తులను తాము మిస్సవుతున్నామని అన్నారు. ఆయన పదవీ విరమణ చేయవచ్చేమో కానీ, ఆయనకు అలసట లేదనే విషయం తనకు తెలుసునని అన్నారు.

Updated Date - 2022-07-17T21:57:20+05:30 IST