ఎంజీయూకు ఐఎ్‌సవో సర్టిఫికెట్‌

Published: Fri, 21 Jan 2022 02:02:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎంజీయూకు ఐఎ్‌సవో సర్టిఫికెట్‌ వీసీకి సర్టిఫికెట్‌ అందజేస్తున్న శివయ్య

నల్లగొండ క్రైం, జనవరి 20: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎ్‌సవో) సర్టిఫికెట్‌ లభించింది. విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్‌ చొల్లేటి గోపాల్‌రెడ్డికి ఇంటర్నేషనల్‌ ఆడిటింగ్‌ ప్రతినిధి ఆలపాటి శివయ్య గురువారం సర్టిఫికెట్‌ అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రెండోసారి న్యాక్‌కు వెళ్తున్న సందర్భంలో ఐఎ్‌సవో సర్టిఫికెట్‌ రావడం హర్షనీయమన్నారు. పచ్చదనం పరిశుభ్రత, విద్యుత్‌ ఆదా, విద్యా విషయక అంశాలకుగాను ఈ సర్టిఫికెట్లు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఈసీ మెంబరు అంజిరెడ్డి, డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ మారం వెంకటరమణారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి మిర్యాల రమేష్‌, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సంధ్యారాణి, ఏఆర్‌ మాధవి పాల్గొన్నారు.   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.