Israel దేశంలో 33 ఏళ్ల తర్వాత మొదటి పోలియో కేసు నమోదు

ABN , First Publish Date - 2022-03-07T13:36:58+05:30 IST

ఇజ్రాయెల్ దేశంలో 33 ఏళ్ల తర్వాత మొట్టమొదటి పోలియో కేసు తాజాగా వెలుగుచూసింది...

Israel దేశంలో 33 ఏళ్ల తర్వాత మొదటి పోలియో కేసు నమోదు

ఇజ్రాయెల్ దేశంలో 33 ఏళ్ల తర్వాత మొట్టమొదటి పోలియో కేసు తాజాగా వెలుగుచూసింది. ఇజ్రాయెల్ దేశంలో పోలియో శాశ్వత నివారణ కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు. 1989వ సంవత్సరం తర్వాత ఇజ్రాయెల్ దేశంలో మొదటి పోలియో కేసు నమోదైందని ఆ దేశ వైద్యులు ప్రకటించారు.పోలియో మొదటి కేసు వెలుగుచూశాక, పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఇజ్రాయెల్ మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది.జెరూసలేంలో 4 ఏళ్ల చిన్నారికి పోలియో సోకినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.1989వ సంవత్సరం తర్వాత ఇజ్రాయెల్‌లో పోలియో కనుగొన్న మొదటి కేసు ఇదేనని ఇజ్రాయెల్ వార్తా సంస్థ నివేదించింది.జెరూసలేంలోని మురుగునీటి నమూనాలలో వైరస్ ను ఇటీవల కనుగొన్నారు.పోలియో కేసు వెలుగుచూడటంతో జెరూసలేంలో మంత్రిత్వ శాఖ యొక్క ప్రాంతీయ ఆరోగ్య పరిపాలన విభాగం ఎపిడెమియోలాజికల్ పరిశోధనను ప్రారంభించింది.


Updated Date - 2022-03-07T13:36:58+05:30 IST